వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌కే రాజీనామా, పార్టీ వీడను: గంటా, ఆ బాటలో...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
విశాఖపట్నం: గవర్నర్ నరసింహన్‌ను రేపు స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేస్తానని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం విశాఖపట్నంలో చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తన రాజీనామాను ఆమోదింప చేసుకుంటానన్నారు. తాను కాంగ్రెసు పార్టని వీడనని, సమైక్యం కోసం పోరాడుతున్నా పార్టీ వీడే ఆలోచన లేదన్నారు. తాను ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు.

కాగా, విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నేరుగా గవర్నర్‌కే రాజీనామా లేఖలను అందజేయాలని గంటాతో పాటు సీమాంధ్రకు చెందిన మరో ముగ్గురు మంత్రులు నిర్ణయించినట్లుగా సమాచారం. వాస్తవానికి మంత్రులు గంటా శ్రీనివాస రావు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప రెడ్డి, కాసు వెంకట కృష్ణా రెడ్డి సహా సీమాంధ్రకు చెందిన మంత్రులు ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

కానీ, వారంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. సీమాంధ్ర ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో నేరుగా గవర్నర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేస్తానని గంటా ఈ రోజు చెప్పారు. ఆయనతో పాటు ఏరాసు, పినిపే, కాసులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గంటా, విశ్వరూప్, ఏరాసులు శనివారం రాత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు. వీరి మధ్య జీతాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు సీమాంధ్రలో 33వ రోజు రోజు ఉద్యమం కొనసాగుతోంది. తమ ఉద్యమం విజయవంతంగా సాగుతుందని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు.

English summary

 Minister Ganta Srinivas Rao on Sunday said he will give his resignation letter to Governor Narasimhan on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X