వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ఉపాధ్యాయులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kapu Ramachandra Reddy
అనంతపురం/ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా శాసన సభ్యుడు కాపు రామచంద్ర రెడ్డికి సమైక్య సెగ తగిలింది. ఆదివారం ఆయనను జిల్లాలో ఉపాధ్యాయ ఐక్యకార్యాచరణ సమితి అడ్డుకుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

వైయస్ ఉంటే సమస్యలుండేవి కాదు: జోగయ్య

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే రాష్ట్రంలో సమస్యలు ఉండి ఉండేవి కాదని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆదివారం ఏలూరులో అన్నారు. సమర్థత, పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యాలే లక్ష్యంగా వైయస్ ఉండేవారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందే రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు.

ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెసు పార్టీ పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. భవిష్యత్తులో కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెసు నేతలు సిద్ధమైతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు.

English summary
YSR Congress Party Anantapuram MLA Kapu Ramachandra Reddy was obstructed by Teachers JAC on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X