వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 తర్వాత కేబినెట్ నోట్: కెసిఆర్ విలీన సంప్రదింపులా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR pushes for early formation of T
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్రమంత్రి ఎకె ఆంటోనితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెసు, తెరాసల్లో చర్చకు దారి తీసింది. శనివారం రాత్రి ఢిల్లీలో ఆంటోని నివాసంలో కెసిఆర్ ఆయనను కలిశారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కెసిఆర్ కలిసినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని, త్వరగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కెసిఆర్ ఆయనను కోరారు. పది జిల్లాల తెలంగాణ తప్ప తాము దేనికీ అంగీకరించమని కెసిఆర్ అన్నప్పుడు, ఆందోళన అవసరం లేదని ఆంటోని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వారి మధ్య పార్లమెంటులో తెలంగాణ బిల్లు, విలీనం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బిల్లు పెడితే విలీనం.. అనే దిశలో కాంగ్రెసు, తెరాసల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొడుతోంది.

దీంతో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మధ్యవర్తిత్వాన కెసిఆర్‌తో చర్చలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెరాస కోరినట్లు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం ఖాయమంటున్నారు. ఇందుకు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నా, కెసిఆర్ మాత్రం పూర్తి సానుకూలమేనని చెబుతున్నారట.

ఈ మేరకు రాబోయే ఎన్నికలు సహా పరస్పర అవసరాలను దృష్టిలో పెట్టుకొని కెసిఆర్, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య వివిధ ప్రతిపాదనలు ప్రస్తావనకు వచ్చాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6 తర్వాత ఏ క్షణంలోనైనా తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ వస్తుందని తెరాస ముఖ్య నేతలు విశ్వసిస్తున్నారు.

ఈ మేరకు పార్లమంటు సమావేశాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటుందని ఢిల్లీలో ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి. హోంశాఖ కేబినెట్‌కు నోట్ సమర్పిస్తుందని, ఆ తర్వాత విభజనానంతర సమస్యలపై మంత్రుల బృందం ఏర్పాటవుతుందని పేర్కొంటున్నాయి.

ఈ కారణంగానే కరీంనగర్‌లో 6న నిర్వహించాలని భావించిన సభను వాయిదా వేసుకున్నారట. కాగా, జిహెచ్ఎంసి లేదా హెచ్ఎండిఎ పరిధిలో రెవెన్యూ, శాంతి భద్రతలు, పోలీసువంటి అధికారాలను గవర్నర్ పరిధిలో ఉంచి, ఆస్తులపై దాడులు జరిగితే విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే సంకేతాలు అందుతున్నాయంటున్నారు.

English summary

 TRS chief K Chandrasekhar Rao, who has been camping in Delhi, met defence minister AK Antony at his residence. This is the first time KCR had a meeting with a senior Congress leader after the announcement of the CWC on Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X