చంద్రబాబుపై లగడపాటి నిప్పులు, అనంత ఆక్షేపణ

బాబు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని, ఆయన విభజన విషయంలో ఎన్నోసార్లు పిల్లిమొగ్గలు వేశారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మ క్షోభించేలా ఆయన యాత్ర ఉందన్నారు. ఆయనది తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర కాదని, ఆత్మక్షోభ యాత్ర అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపికి సమైక్యాంధ్రపై మాట్లాడే అర్హత లేదన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా అన్ని పార్టీలు తీర్మానం చేయాల్సిందే అన్నారు.
విభజనపై నాటకాలు ఆడితే ఊరుకునేది లేదన్నారు. తమ పార్టీ అధినేత్రిని చంద్రబాబు విమర్సించడం సరికాదన్నారు. సోనియాను బాబు విమర్శించడాన్ని అనంత వెంకట్రామి రెడ్డి ఆక్షేపించారు. టిడిపి సభ్యులు సభలో హుందాగా వ్యవహరించడం లేదన్నారు. ఇందిర మాస్కులతో సభకు రావడమేమిటని ప్రశ్నించారు. వారు ఏ ప్రాంతానికి ఆ గొడుకు పడుతున్నారని ఆరోపించారు.
ప్రజాభీష్టం మేరకు కేంద్రం విభజనపై తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే అన్నారు. యాత్రలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమే అవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము అధిష్టానాన్ని వ్యతిరేకించినట్లు సీమాంధ్ర టిడిపి ఎంపీలు కూడా బాబును అడగాలన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు యాత్రలు చేస్తున్నాయని ఆరోపించారు.