కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుకు చల్లా రాజీనామా: జగన్ పార్టీలోకి జంప్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Challa Ramakrishna Reddy resigns for Congress
కర్నూలు/ హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే చల్లారామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ తెలుగువారిని చీల్చే ఆలోచన చేసిందని విమర్శించారు.

వైయస్ రాజశేఖర రెడ్డిలాంటి నాయకుడు ఉంటే ఇలాంటి ఉద్యమాలే వచ్చేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజశేఖర రెడ్డి కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, కుటుంబీకులు తప్ప మిగతావారెవరూ చిత్తశుద్ధితో సమైక్యాంధ్రకోసం పోరాడటం లేదన్నారు. జగన్ అనుమతిస్తే ఆ పార్టీలో చేరతానన్నారు.

సమైక్యాంధ్రలోనే తెలంగాణ అనేక రంగాల్లో అభివద్ధి సాధించిందని 20 సూత్రాల పథకం అమలు ఛైర్మన్ డాక్టర్ ఎన్ తులసీరెడ్డి అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కలిసిన ప్రాంతాలతో పోల్చిచూసిన ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం ఎంతో అభివద్ధి చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు సమైక్యత వైపు పరుగులు తీస్తూంటే రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణలుగా ఎందుకు విడిపోవాలని ఆయన ప్రశ్నించారు.

సమైక్యమనే పదం అణచివేతకు, వలసవాద తత్వానికి, సామ్రాజ్యవాదానికి ప్రతీకని, విడిపోయి కలిసి ఉన్నామనే ఖ్యాతిని తెలుగుజాతి దక్కించుకునే విధంగా సీమాంద్రులు సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బందం నాయకులు వ్యాఖ్యానించడం హాస్యస్పదమని ఆయన అన్నారు. సమైక్యమనే పదానికి సరికొత్త సిద్దాంతాన్ని కనిపెట్టిన వీరికి నోబుల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుందేమోనని ఆయన అన్నారు.

English summary
Former MLA from Kurnool district Challa Ramakrishna Reddy has resigned to congress and expressed his intention to join in YS Jagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X