వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భత్కల్ ఫేస్ టు ఫేస్ విచారణ!, తహసీం కోసం గాలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Bhatkal to be quizzed along with other IM men
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను, ఇతర ఉగ్రవాదులను జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఫేస్ టు ఫేస్ ప్రశ్నించనున్నారు. దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక నిందితుడు భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ ఇటీవల పట్టుబడిన విషయం తెలిసిందే. వారిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఇతర ఉగ్రవాదులను, భత్కల్‌ను ఎదురెదురుగా ఉంచి అధికారులు విచారించనున్నారని సమాచారం.

భత్కల్‌కు మోకా కోర్టు రవాణా వారెంట్

యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా మంబయిలోని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం(మోకా) ప్రత్యేక కోర్టు రవాణా వారెంటు జారీ చేసింది. 2011లో జరిగిన మూడు బాంబు పేలుళ్లలో 27 మంది మృతి చెందారు. ఈ కేసు విచారణకు సంబంధించి నిందితులిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద నిరోధక దళం మోకా ప్రత్యేక కోర్టుకు విన్నవించుకుంది.

భత్కల్ సహాయకుడి కోసం గాలింపు

భత్కల్ సహాయకుడు మహ్మద్ తహసీం అక్తర్ అలియాసా మోను కోసం ఎన్ఐఏ గాలిస్తోంది. పలు దాడులతో ప్రమేయం ఉందని భావిస్తున్న తహసీం ఆచూకి తెలిపిన వారికి రూ.10లక్షల బహుమతిని ఇదివరకే ప్రకటించారు. అతనికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. బీహారులోని సమస్తిపూర్ జిల్లా మణియారి గ్రామంలోని తహసీం ఇంటికి వెళ్లిన అధికారులు తండ్రిని ప్రశ్నించారు.

దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్ అరెస్టు నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర పోలీసులను ప్రశంసించారు. ఇటువంటి విషయాలపై రాజకీయ నాయకులు మాట్లాడటం భావ్యం కాదన్నారు.

English summary

 NIA is going to get Indian Mujahideen India operations' chief Yasin Bhatkal face to face with other IM operatives, including those who conducted a reconnaissance of Dilsukhnagar in Hyderabad where blasts in February had claimed 17 lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X