వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూషణ: ఢిల్లీ సిఎం తనయుడిపై నామా హక్కుల నోటీసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sandeep Dikshit
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సభ్యులు, చిత్తూరు ఎంపి శివ ప్రసాద్‌ను దూషించారని ఆరోపిస్తూ టిడిపి ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు కాంగ్రెసు ఎంపి, విప్ సందీప్ దీక్షిత్ పైన మంగళవారం స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. సందీప్ దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు. ఆయన సోమవారం తమను తిట్టారని టిడిపి ఎంపీలు ఆరోపించిన విషయం తెలిసిందే.

కాగా, పార్లమెంటు సాక్షిగా సందీప్ దీక్షిత్ తమను హెచ్చరించినట్లుగా శివ ప్రసాద్ ఆరోపించారు. కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి శివ ప్రసాద్ మీదికి వెళ్లబోయారట. అయితే, సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఇతర ఎంపీలు వారిని అడ్డుకున్నారు. ఇందిరా గాంధీ మాస్కు ధరించిన శివప్రసాద్ సభకు వచ్చి.. రాష్ట్ర సమైక్యతపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.

దీంతో ఒకరిపై మరొకరు స్పీకర్ మీరా కుమార్‌కు ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు సందీప్ దీక్షిత్, మధుయాష్కీ గౌడ్ సభ గౌరవాన్ని మంటగలిపారని, పార్లమెంటు హుందాతనానికి సంబంధించిన అన్ని హద్దులనూ అతిక్రమించారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభ వాయిదా పడింది. విభజనపై నిరసనలు ఆగకపోవడంతో 11.06 గంటలకు స్పీకర్ 9 మంది పేర్లను చదివి వారిని సభ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. సభ వాయిదా పడిన వెంటనే ఉదయం 11.15 గంటలకు సందీప్ దీక్షిత్, మధుయాష్కీ, టిడిపి ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. పార్లమెంట్ నుంచి బయటకు రా, ఢిల్లీలోనే నిన్ను చంపేస్తానని శివప్రసాద్‌ను ఉద్దేశించి సందీప్ దీక్షిత్ అన్నారట.

English summary

 Telugudesam Party MP Nama Nageswara Rao on Tuesday gave violation notice against Congress MP and Whip Sandeep Dikshit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X