వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధ వాతావరణం: సిరియా వైపు రెండు మిసైల్స్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

డమాస్కస్: సిరియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయా? అంటే పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. సిరియా వైపు రెండు బాలిస్టిక్ మిసైల్స్ వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాస్కో సమయం ప్రకారం ఈ రోజు ఉదయం 10.16 నిమిషాలకు రెండు బాలిస్టిక్ రాకెట్లు సిరియా వైపు వెళ్లాయి. అవి మధ్యధరా సముద్రం నుండి వచ్చాయి.

రెండు రాకెట్లను రష్యా రాడర్ కనిపెట్టిందని, అవి మధ్యధరా సముద్రంలో కూలాయని రష్యా డిఫెన్స్ మినిస్టరీ తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, సిరియాలోని రష్యన్ ఎంబసీ మాత్రం అలాంటి సమాచారం ఇంకా తమకు ఏదీ అందలేదని తెలిపింది. సిరియన్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా తమ సిరియన్ రాడర్ ఎలాంటి మిసైల్‌ను గుర్తించలేదని తెలిపింది.

Syria

సిరియాలో అంతర్యుద్ధం నేపథ్యంలో జోక్యానికి అమెరికా ఉవ్వీళ్లూరుతోంది. కాంగ్రెసు అనుమతి కోసం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు సిరియా దేశంలోని అంతర్యుద్ధంలో జోక్యం చేసుకునేందుకు బ్రిటన్ పార్లమెంటు తిరస్కరించింది. సిరియాకు చైనా, రష్యాలు అండగా నిలుస్తున్నాయి.

కాగా, కొద్ది రోజుల క్రితం సిరియాలో ప్రభుత్వం తిరుగుబాటుదారులపై రసాయన దాడులకు తెగబడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి రసాయన దాడులకు పాల్పడలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

English summary
Amid escalating violence in Syria, it has been reported that two ballistic missiles have been fired towards the Syria, on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X