వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిలపై పొన్నం విడాకులు, ఎంపీ సిల్క్‌స్మితలా అంటూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Siva Prasad - Sharmila
న్యూఢిల్లీ: నీకు ఇష్టం లేకుంటే నువ్వు విడాకులు ఇవ్వొచ్చు.. మాకు ఇష్టం లేకుంటే మేం ఇవ్వకూడదా? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలను కాంగ్రెసు పార్టీ కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రశ్నించారు. తన నివాసంలో పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇష్టం లేకున్నా తమతో ఉండాలంటూ యాసిడ్ దాడులకు పాల్పడినట్లు బలవంతంగా పరిపాలించాలని చూడటం మంచిదా? అని ప్రశ్నించారు.

బెంగళూరులో 32 ఎకరాలకు రక్షణ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో రక్షణ ఉండదా? అని షర్మిలను ప్రశ్నించారు. తాము తెలంగాణ కోసం ఎన్నోసార్లు ఉద్యమించినా ఏనాడూ శ్రుతి మించలేదన్నారు. 48 గంటల పాటు దీక్ష చేస్తే ఒక్క సీమాంధ్ర ఎంపీ కూడా వచ్చి పలకరించలేదని చెప్పారు. తెలంగాణను ఆపుతానంటూ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధానికి సూచించామన్నారు.

మరోవైపు కళాత్మకత పేరుతో సిల్క్‌స్మితలాగా తిరుగుతానంటే కుదరదని తెలుగుదేశం పార్టీ ఎంపి శివ ప్రసాద్‌ను ఉద్దేశించి అన్నారు. పార్లమెంటు వాయిదా పడినప్పటికీ టిడిపి ఎంపీలు మాట్లాడిన మాటలు అన్నీ రికార్డు అయ్యాయని, వాటిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపిస్తున్నామన్నారు. టిడిపి రాజ్యసభ సభ్యులు సిఎం రమేశ్, సుజనా చౌదరిలకు కనీస పార్లమెంటరీ సంప్రదాయాలు తెలియవన్నారు.

బాబుది ఒంటికన్ను సిద్ధాంతం: కిషన్ రెడ్డి

రాష్ట్ర విభజనపై చంద్రబాబుది ఒంటికన్ను సిద్ధాంతమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాులో ధ్వజమెత్తారు. గత నాలుగున్నరేళ్ల తెలంగాణ ఉద్యమంలో 1100 మంది చనిపోయినా మాట్లాడని చంద్రబాబు.. నేడు యాత్ర పేరుతో సీమాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడన్నారు. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎటువంటి అపోహలూ ప్రజల్లో తలెత్తలేదన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Karimnagar MP Ponnam Prabhakar said that YSR Congress president YS Jagan's sister YS Sharmila is only cencentrated their proporties in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X