వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివప్రసాద్‌కు దూషణ: సందీప్‌కు రేణుక చౌదరి సవాల్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Renuka Chowdhury
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివ ప్రసాద్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు, కాంగ్రెసు విప్ సందీప్ దీక్షిత్ హెచ్చరించిన అంశంపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి బుధవారం మండిపడ్డారు. దక్షిణాది వారి పట్ల ఇంత చిన్న చూపా అని ఆమె ప్రశ్నించారు.

ఢిల్లీలో ఎలా తిరుగుతావో చూస్తామని సందీప్ ఎలా అంటారని, ఇది దక్షిణాదివారి పట్ల చూపిస్తున్న చిన్నచూపు అని, మనమంటే అంత చులకనా అని రేణుకా చౌదరి అన్నారట. ఆమె ఈ విషయం చెబుతుండగా సందీప్ దీక్షిత్ అక్కడకు వచ్చారు. ఇదిగో దీక్షిత్ నేను ఢిల్లీలోనే ఉన్నానంటూ ఆమె దీక్షిత్‌తో అన్నారట.

విభజన ఆపాలంటూ పిటిషన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియపై శాశ్వత నిలిపివేత ఉత్తర్వులు(పర్మినెంట్ ఇంజంక్షన్) జారీ చేయాలంటూ విశాఖ జిల్లా నర్సీపట్నం బార్ కౌన్సిల్ తరపున అధ్యక్షుడు చింతల సూర్యప్రకాశ రావు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదుల కదలికలను కట్టడి చేయాలని నర్సీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆయన కోరారు.

కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, యూపిఏ కూటమి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పిసిసి, తెలుగుదేశం, బిజెపి, అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, నారా చంద్రబాబునాయుడు, కిషన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణను ప్రతివాదులుగా చేర్చారు.

English summary
Congress Party senior leader Renuka Choudhary on Wednesday responded on Siva Prasad and Sandeep Dikshit issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X