సిరియాపై ఒబామా వార్న్: హైద్రాబాద్లో ర్యాలీ(పిక్చర్స్)
వాషింగ్టన్/డమాస్కస్/మాస్కో/హైదరాబాద్: సిరియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రజలపై రసాయనిక దాడులకు పాల్పడిన సిరియా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటున్నారు. ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకుంటే అంతర్జాతీయ ఒప్పందాలకు విలువ అనేదే ఉండదని, ఇది తన విలువలకు సంబంధించిన అంశం కాదని చెప్పారు.
సిరియాపై పరిమిత యుద్ధానికి సెనేట్ నుండి అనుమతి లభించింది. 60 రోజుల వరకు సిరియాపై సైనిక చర్యకు అనుమతిస్తూ అమెరికా సెనేట్ వ్యవహారాల కమిటీ తీర్మానాన్ని సిద్ధం చేసింది. అమెరికాకు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. సిరియాకు బుద్ధి చెప్పాల్సిందేనని తెలిపింది. సిరియాపై ఏకపక్ష దాడిని సహించేది లేదని రష్యా హెచ్చరించింది.
అదే సమయంలో సిరియాలో నిజంగానే రసాయనిక విష ప్రయోగం జరిగినట్టు నిరూపణ అయితే ఆ దేశంపై సైనిక చర్య జరపాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పింది. ఐరాస ద్వారా తప్ప సిరియాపై ఎటువంటి దాడికి పాల్పడినా ఒప్పుకునేది లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు అగ్రదేశాలు యుద్ధానికి కాలు దువ్వితే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని సిరియా ప్రకటించింది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా తమపై దాడి చేస్తే ఊరుకునేది లేదని తెలిపింది.

బరాక్ ఒబామా
ప్రజలపై రసాయనిక దాడులకు పాల్పడిన సిరియా ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే అంతర్జాతీయ ఒప్పందాలకు విలువ ఉండదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

హైద్రాబాద్ 1
సిరియాపై అగ్ర దేశం అమెరికా సైనిక దాడికి ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిరసిస్తూ ఎపిలోని హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేస్తున్న లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్.

హైద్రాబాద్ 2
సిరియాపై అగ్ర దేశం అమెరికా సైనిక దాడికి ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్, నారాయణగూడలలో నిరసన వ్యక్తం చేస్తున్న లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్.

హైద్రాబాద్ 3
సిరియాపై అగ్ర దేశం అమెరికా సైనిక దాడికి ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఎఐవైఎఫ్, పివైఎల్, ఎఐఎఫ్డివై, పిడిఎస్యు, ఎఐఎప్డిఎస్ ఆర్గనైజేషన్స్.

హైద్రాబాద్ 4
సిరియాపై అగ్ర దేశం అమెరికా సైనిక దాడికి ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిరసిస్తూ ఎపిలోని హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేస్తున్న లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్.

హైద్రాబాద్ 5
సిరియాపై అగ్ర దేశం అమెరికా సైనిక దాడికి ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిరసిస్తూ ఎపిలోని హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేస్తున్న లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. అమెరికా పతాకాన్ని కాల్చివేస్తున్న దృశ్యం.