వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రిమాండ్ పొడిగింపు: కోర్టు వద్ద ధర్మానకు టి షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy and Dharmana Prasad Rao
హైదరాబాద్: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రిమాండును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు శుక్రవారం ఈ నెల 20వ తారీఖు వరకు పొడిగించింది. జగన్ ఆస్తుల కేసులో ఆయనతో పాటు మాజీ మంత్రి నిమ్మగడ్డ ప్రసాద్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి తదితరుల రిమాండును పొడిగించింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన అనుచరుడు అలీ ఖాన్ తదితరుల రిమాండును కూడా 20వ తేది వరకు పొడిగించారు. ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును కూడా పొడిగించారు. వీరిని కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది.

కోర్టుకు ధర్మాన, సబిత

జగన్ ఆస్తుల కేసులో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ కేసులో ఉన్న నిత్యానంద రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్, ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, విజయ రాఘవలు కోర్టుకు వచ్చారు.

ధర్మానకు తెలంగాణ సెగ

సిబిఐ కోర్టులో ధర్మాన ప్రసాద రావుకు తెలంగాణ సెగ తగిలింది. పలువురు తెలంగాణ న్యాయవాదులు ధర్మానను అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

English summary
A special CBI court on Friday extended till September 20, the judicial remand of YSR Congress chief YS Jaganmohan Reddy and other accused in connection with the case pertaining to quid pro quo deals involving the Kadapa MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X