వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు సీరియల్ రేపిస్టు జయశంకర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Jail-break serial rapist Jaishankar arrested
బెంగళూర్: పేరు మోసిన నేరస్థుడు, సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. కట్టుదిట్టమైన భద్రత గల సెంట్రల్ జైలు నుంచి అతను ఈ నెల 1వ తేదీన పారిపోయాడు. జయశంకర్‌ను బెంగళూర్‌లోని కుడ్లిగేట్ వద్ద అరెస్టు చేసినట్లు బెంగళూర్ పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.

అతని ఆచూకీ చెప్పినవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదే అతన్ని పట్టిచ్చినట్లు సమాచారం. జైలు నుంచి పారిపోయిన తర్వాత అతని కోసం పోలీసులు లుకవుట్ నోటీస్ జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేశారు.

36 జయశంకర్ మానసిక ఉన్మాది అని చెబుతున్నారు. తమిళనాడులోని సేలం జిల్లాలోని కన్యపట్టణం కోనసముద్ర గ్రామానికి చెందిన జయశంకర్‌కు అక్రమ చొరబాటు, అత్యాచారం, హత్య నేరాల కింద పదేళ్ల జైలు శిక్ష పడింది.

తమిళనాడులోని చెన్నై, ధర్మపురి, హోసూరు, సేలం, తిరుపత్తూరుల్లో, కర్ణాటకలోని బెంగళూర్ రూరల్‌, చిత్రదుర్గ, హిరియూరు, కడూరు, మోలకల్మూరు, తుంకూరుల్లో 20కి పైగా కేసుల్లో అతను విచారణను ఎదుర్కుంటున్నాడు.

English summary

 Notorious criminal and serial rapist Jaishankar, who made a sensational escape from the high-security central prison here on September 1, was arrested here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X