వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేదికపై గజల్ శ్రీనివాస్ గళం: చానెళ్లకు సిపి ఆంక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gazal Srinivas
హైదరాబాద్: 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు గజల్ శ్రీనివాస్‌కు అతి కష్టం మీద అనుమతి లభించింది. తొలుత ఈ సభకు ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉండటంతో సభా ప్రాంగణానికి వచ్చిన గజల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటికి కళాకారులకు సభలోకి అనుమతి లభించింది. తాము ప్రత్యేకంగా ఆహ్వానించామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పడంతో పోలీసులు వారిని లోనికి అనుమతించారు.. సభా వేదికపై సమైక్యవాదులను ఉద్ధేశించి ప్రసంగించిన ఆయన సమైక్యాంధ్ర ప్రాధాన్యతను తెలియజేస్తూ గీతాలను ఆలపించారు.

'సేవ్ ఆంధ్రప్రదేశ్ ' సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్దకు పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. ఎపీఎన్జీవోలు సభకు భారీగా తరలివస్తున్నారు.స్డేడియంలోని గ్యాలరీలన్ని ఉద్యోగులతో నిండిపోయాయి. గుర్తింపు కార్డు ఉన్న వారిని పోలీసులు లోనికి అనుమతినిస్తున్నారు. స్డేడియం మొత్తం సమైక్య నినాదాలతో హోరెత్తుతోంది.

ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో మీడియా ఛానెళ్లకు పోలీసులు పలు ఆదేశాలు చేశారు. ఏపీఎన్జీవో సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఫైల్ షాట్స్ పదేపదే వేయొద్దని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ఆదేశించారు. దాడులు, హింసాత్మక ఘటనలు ప్రసారం చేయవద్దని ఆదేశించారు..

కాగా, ఏపీఎన్జీవో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ సందర్భంగా నగరంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 6 గంటలకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సభ జరిగే ఎల్పీస్టేడియం వైపు వెళ్లే మార్గాలైన ఖైరతాబాద్, అబిడ్స్, గన్‌ఫౌండ్రి,ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్, కింగ్ కోఠి, హిమాయత్‌నగర్,లిబర్టీ చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

English summary
Gazal Srinvas has got entry into the LB stadium, where AP NGOs held Save Andhra Pradesh convention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X