వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తుల కళాకేళి: కెసిఆర్, సోనియా ముసుగు (ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో శుక్రవారం లక్షగళ సమైక్య భేరీ జరిగింది. సీమాంధ్ర ఉద్యమాన్ని అడ్డుకోవడానికి దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, మా ఓపికకు పరీక్షించవద్దని 48 సంఘాల ఉద్యోగ జెఎసి కన్వీనర్, తిరుపతి ఆర్‌డిఓ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.

శాప్స్ నగర జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి శాప్స్ నగర జెఎసి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కూడలిలో జరిగిన ‘లక్షగళ సమైక్యభేరి'కి పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. ఆర్‌డిఓ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎంత అడ్డుకోవాలని చూస్తారో అంత ఉద్ధృతంగా ఉద్యమించడానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారన్న విషయాన్ని ఇటు వేర్పాటువాదులు, అటు కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు.

తిరుపతి శాప్స్ నగర జెఎసి ఆధ్వర్యంలో జరిగిన ‘లక్షగళ సమైక్యభేరి'

జెఎసి కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లె సుధారాణి మాట్లాడుతూ - 60 ఏళ్లుగా కలిసి జీవించిన తెలుగుప్రజల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే దుర్మారుల్లా కేంద్రం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. మదనపల్లెలో కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు ‘తుఫాన్' చిత్ర ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకున్నారు.

మిట్స్ జెఎసి ప్రతినిధులు వేర్పాటువాదులు కెసిఆర్, కోదండరామ్ ముసుగు ధరించిన వ్యక్తులకు అరగుండు చేయించి ప్రదర్శించారు. బి.కొత్తకోట జ్యోతి సర్కిల్‌లో ఉపాధ్యాయులు గోడ కుర్చీపై నిలబడి నిరసన తెలిపారు.

కత్తుల కళాకేళి..

కత్తుల కళాకేళి..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో శుక్రవారం లక్షగళ సమైక్య భేరీ జరిగింది. ఈ సందర్భంగా కళాకారులు కత్తుల కళాప్రదర్శన చేశారు.

కళా ప్రదర్శన..

కళా ప్రదర్శన..

సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆందోళనకారులు తిరుపతిలో ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

సమైక్య గళం..

సమైక్య గళం..

వేదిక మీది నుంచి కళాకారులు, సమైక్యవాదాలు సమైక్య గళం వినిపించారు. ఆర్‌డిఓ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎంత అడ్డుకోవాలని చూస్తారో అంత ఉద్ధృతంగా ఉద్యమించడానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారన్న విషయాన్ని ఇటు వేర్పాటువాదులు, అటు కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు.

ఉత్సాహాన్నిచ్చిన కళాకారులు

ఉత్సాహాన్నిచ్చిన కళాకారులు

సమైక్య ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారికి కళాకారులు ఉత్సాహాన్నిచ్చారు. వారితో పాటు ఇతరులు కూడా నృత్యం చేసి అలరించారు.

తరలిన ప్రజలు..

తరలిన ప్రజలు..

తిరుపతి శాప్స్ నగర జెఎసి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కూడలిలో జరిగిన ‘లక్షగళ సమైక్యభేరి'కి పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు.

పిల్లల సమైక్యాంధ్ర

పిల్లల సమైక్యాంధ్ర

పిల్లలు వినూత్నంగా సమైక్యాంధ్ర ప్రదర్శన చేశారు. విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదంతో వరుసగా నిలబడి ప్రదర్శన ఇచ్చారు.

కెసిఆర్, సోనియా ముసుగులు

కెసిఆర్, సోనియా ముసుగులు

సమైక్య ఆందోళనకారులు కెసిఆర్, సోనియా ముసుగులు ధరించిన వ్యక్తులతో రాష్ట్ర విభజనకు నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్, కోదండరామ్ ముసుగులు ధరించిన వ్యక్తులకు అరగుండు చేశారు.

చిత్రపటంపై తెలంగాణ తల్లి

చిత్రపటంపై తెలంగాణ తల్లి

సమైక్యాంధ్ర నినాదాన్ని చాటడానికి కళాకారులు వివిధ చరిత్ర పురుషులు వేషాల్లో దర్శనమిచ్చారు. సమైక్యాంధ్ర చిత్రపటంపై ఓ వైపు పొట్టి శ్రీరాములు చిత్రాన్ని, మరో వైపు తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రదర్శించారు.

బొమ్మ తుపాకితో గురి

బొమ్మ తుపాకితో గురి

విభజనకు కారణమని ఆరోపిస్తూ సోనియా, కెసిఆర్ ముసుగులు ధరించిన వ్యక్తుల వైపు ఓ బాలుడు బొమ్మ తుపాకిని గురి పెట్టిన చిత్రాన్ని చూడవచ్చు.

పోటెత్తిన వీధులు

పోటెత్తిన వీధులు

తిరుపతి వీధులు ఉద్యోగులు, కళాకారులు, పిల్లలు పెద్దలతో లక్ష గళ సమైక్య భేరీతో పోటెత్తాయి. ఇలా ప్రదర్శన జరిగింది.

English summary
Opposing the bifurcation of Andhra Pradesh, samikya Bheri has been organised at Tirupathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X