హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిఎన్జీవో వేదికపైకి చెప్పు, యువకుడిని కొట్టిన వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chappal at AP NGOs meeting
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదారాబాదులో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ రెండు మూడు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సభ ప్రారంభం సమయంలో ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతున్న సమయంలో మీడియా గ్యాలరీ నుంచి గుర్తు తెలియని వ్యక్తి జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ వేదిక పైకి చెప్పు విసిరాడు.

దీంతో అఖ్కడే ఉన్న సమైక్యాంధ్ర ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలు అతనిని పట్టుకొని కొట్టారు. విషయం గమనించిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభకు పది నిమిషాలు అంతరాయం ఏర్పడింది. నాలుగు గంటల సమయంలో వేదిక వెనుక భాగంలో ఎఫ్ఎంసి గ్యాలరీ వైపు సభకు వచ్చిన వారి చూపు మళ్లింది. అక్కడ ఎవరో నల్ల జెండాలు చూపిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఎక్కడ ఎవరు లేరని పోలీసులు నిర్ధారించారు.

ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వేదిక కింద జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఐదు నిమిషాల పాటు స్టేడియంలో సమైక్యాంధ్ర ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు, పోలీసుల బారికేట్లు, ఆంక్షలను దాటుకొని ఎల్బీ స్టేడియం వద్దకు కొంతమంది తెలంగాణవాదులు చేరుకున్నారు. స్టేడియం బయట, లోపల కొంతసేపు హల్‌చల్ సృష్టించారు.

ఉదయం పదిన్నర సమయంలో ఓయు ఐకాసకు చెందిన ముగ్గురు విద్యార్థులు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ముందుగా ఎల్బీ స్టేడియం ఏ గేట్ వద్దకు చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇక్కడ జరిగిన ఘటనలో బాలరాజ్ యాదవ్, కుమార్ సాగర్, హరిబాబు అనే ముగ్గురు ఓయూ ఐకాస విద్యార్థులు గాయపడ్డారు. బాలరాజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు గోషామహల్ ఆస్పత్రికి తరలించారు. అతనిని పలువురు పరామర్శించారు.

English summary

 Unknown person thrown chappal at APNGOs meeting on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X