హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాక్షనిస్టుల దాడి: ఈటెల, పాలతో ఎల్బీ స్టేడియం శుద్ధి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: జై తెలంగాణ అంటే దాడి చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఆదివారం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆందోళనలు నిజమయ్యాయని, ఫ్యాక్షనిస్టులు, గూండాలతో కలిసి దాడి చేశారని మండిపడ్డారు. జై తెలంగాణ అని నినాదం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

తెలంగాణ నడి గడ్డ మీద జై తెలంగాణ నినాదాలు చేసే స్వేచ్ఛ తమకు లేదా అన్నారు. తెలంగాణ గడ్డ పైన జై సమైక్యాంధ్ర అంటే తప్పు లేదు కానీ, జై తెలంగాణ అంటే కొడతారా అన్నారు. ఇంత హింస జరిగాక కూడా ఎందుకు కలిసుండాలని ప్రశ్నించారు. నిన్నటి ఘటనలో తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు.

ఎపిఎన్జీవోల సభ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభ అని రుజువైందన్నారు. డబ్బు ఉందన్న మదంతో సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగింది సమైక్య సభ కాదని, ఆంధ్రా ఆధిపత్య సభ అని తెరాస నేత శ్రవణ్ కుమార్ అన్నారు.

డిసిపిని కలిసిన ఓయు విద్యార్థులు

సెంట్రల్ జోన్ డిసిపిని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉదయం కలిశారు. నిజాం కళాశాల విద్యార్థులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.

పాలతో ఎల్పీ స్టేడియం శుద్ధి

ఎపిఎన్జీవోల సభతో ఎల్బీ స్టేడియం మలినమైందని చెబుతూ తెలంగాణ న్యాయవాదులు స్టేడియాన్ని ఈ రోజు ఉదయం పాలు, పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.

English summary
TRSLP Etela Rajender on Sunday lashed out at APNGOs meeting on Sunday for beating Constable and Telangana activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X