హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గజల్‌కు షాక్, సభలో ఆరడుగుల బుల్లెట్!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన ఎపిఎన్జీవో సభ విజయవంతం కావడంతో పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ కోసం సీమాంధ్ర నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో సామాజిక కార్యకర్త సత్యవాణి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. సభలో పలువురు నటులు ఎల్బీ శ్రీరామ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, మోహన్ బాబు, కళ్లు చిదంబరం తదితరులను అనుకరించి మిమిక్రీ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పాటను అనుకరిస్తూ 'ఆరు అడుగుల బుల్లెట్ అశోక్ బాబు జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. సభలో గజల్ శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆట - పాట, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గజల్ శ్రీనివాస్ గానం చేసిన ఓరి తెలుగువాడా పాటకు అనుగుణంగా కళాకారులు నృత్యం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టారు.

వంగపండు ప్రసాద రావు, గజల్ శ్రీనివాస్ ఆటపాటలతో అలరిస్తారని నిర్వాహకులు ముందుగా ప్రకటించినప్పటికీ వీరిద్దరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. చివరికి గజల్ శ్రీనివాస్‌ను మాత్రం లోపలికి పంపించారు. గతంలో వంగపండుకు మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయంటూ ఆయనను లోపలికి పంపలేదు. వంగపండు స్టేడియం బయటే ఆడి పాడారు.

నిర్వాహకులు సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే వైపు ఉన్న వేదికకు గురజాడ అప్పారావు పేరు పెట్టారు. సభా వేదికకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలీసులు తనను అనుమతించని విషయాన్ని చెబుతూ... 'పోలీసులు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించారు. ఉద్యోగిని కానంటూ నన్ను కూడా అడ్డుకున్నారు. వారికి జోహార్లు' అని గజల్ శ్రీనివాస్ అన్నారు. 'తెలంగాణ వాళ్లకు ధూమ్ ధామ్‌లు, పాటలు ఉన్నాయి. మనకు కూడా పాటలు కావాలి' అని అశోక్ బాబు పేర్కొన్నారు. ఎండ తీవ్రత కారణంగా సభకు వచ్చిన వారు గ్యాలరీల్లో కూర్చోడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత మైదానం నిండిపోయింది.

ఆటా - పాటా

ఆటా - పాటా

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో కళాకారుల ఆటా - పాటా దృశ్యం.

సభకు వచ్చిన ఉద్యోగులు

సభకు వచ్చిన ఉద్యోగులు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు హాజరైన ఉద్యోగులు, ఇతరులు.

సభ కోసం

సభ కోసం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ కోసం లోనికి వెళ్తున్న దృశ్యం.

సమర శంఖం

సమర శంఖం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో సమర శంఖం పూరిస్తున్న ఓ ఉద్యోగి.

బందోబస్తు

బందోబస్తు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ వద్ద పోలీసుల భారీ బందోబస్తు.

మహిళలు

మహిళలు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో వేదికపై మహిళల ఆట - పాట

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న మహిళలు.

గజల్ శ్రీనివాస్ ఇతరులు

గజల్ శ్రీనివాస్ ఇతరులు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో పాల్గొన్న గజల్ శ్రీనివాస్, ఇతర ఉద్యోగులు.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో వేదికపై జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న దృశ్యం.

వేదికపై అశోక్ బాబు

వేదికపై అశోక్ బాబు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో వేదికపై అశోక్ బాబు ఇతరులు. 'ఆరు అడుగుల బుల్లెట్ అశోక్ బాబు జిందాబాద్' అంటూ నినదించారు.

వంగపండు ఆటా పాట

వంగపండు ఆటా పాట

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు లోనికి అనుమతించక పోవడంతో బయట ఆటా పాట నిర్వహిస్తున్న వంగపండు

ఒళ్లంతా సమైక్యం

ఒళ్లంతా సమైక్యం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు సమైక్య నినాదాలతో వచ్చిన ఓ సమైక్యవాది.

వస్తున్న ఉద్యోగులు

వస్తున్న ఉద్యోగులు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు వస్తున్న మహిళా ఉద్యోగులు.

గజల్ కు పోలీసులు నో

గజల్ కు పోలీసులు నో

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు వస్తున్న గజల్ శ్రీనివాస్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ఆయన లోనికి వెళ్లారు.

English summary
Bringing their struggle for united Andhra Pradesh to the state capital, thousands of employees from Rayalaseema and Andhra regions on Saturday held a massive show of strength, urging the Congress to withdraw its decision to bifurcate the state and declaring that they are not ready to give up Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X