వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ నాయకత్వంలో సంతోషంగా పని చేస్తా: ప్రధాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Will be very happy to work under Rahul Gandhi's leadership, Manmohan says
న్యూఢిల్లీ(ప్రధాని ప్రత్యేక విమానం నుంచి): తాను వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శనివారం అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలో ఏ పాత్ర పోషించేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చారు. రాబోయే ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి పదవికి రాహుల్ ఆదర్శనీయమైన ఎంపిక అని, ఆయన నాయకత్వంలో పని చేయడం తనకు సంతోషదాయకమని మన్మోహన్ అన్నారు.

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న జి-20 సదస్సుకు వెళ్లి తిరిగి వస్తున్న ఆయన ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణం అయినా, మరే ఇతర అంశమైనా ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలు అన్నిటికీ తాను సమాధానం చెప్పాననే భావిస్తున్నానని అన్నారు.

పార్లమెంటుకు చెప్పకుండా ఏ విషయాన్నీ దాచాలన్న ఉద్దేశం తనకు లేదని, తన పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న ఎవరినీ తాను నియంత్రించలేదని చెప్పారు. తెలంగాణ తరహాలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. ఈ నెల చివర్లో న్యూయార్క్‌లో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అవుతానో లేదో చెప్పలేనని, దీనికి సంబంధించి ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని కఠిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

సాధారణ పరిస్థితుల్లో షరీఫ్‌తో భేటీ ఆనందదాయకమేనని, కానీ, క్షేత్రస్థాయిలో కఠిన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తుది నిర్ణ యం తీసుకోవడానికి ముందు ఇటీవలి ఉగ్రవాద దాడులు, ముంబై ముష్కరులను శిక్షించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అంశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని వ్యాఖ్యానించారు.

English summary

 Indicating he was ready to don any role in the Congress after the 2014 general elections, Prime Minister Manmohan Singh on Saturday said he will be "very happy" to work under the leadership of Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X