వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనపై సీఎం కిరణ్ డ్రామాలు: శ్రీకాంత్ రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

Srikanth Reddy
హైదరాబాద్: కాంగ్రెస్ పెద్దల లాబీయింగ్‌తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధికార దాహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పదవి పోతుందనే భయంతోనే రాష్ట్ర విభజనపై డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. విభజనకు తాను కారణం కాదని కిరణ్ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. అధిష్టానం పెద్దలతో ప్యాకేజీ గురించి చర్చించిన మాట వాస్తవం కాదా అని కిరణ్‌ను ప్రశ్నించారు. పదవిని కాపాడుకోవడం కోసం సీమాంధ్ర ప్రజలకు కిరణ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీవితాల గురించి ముఖ్యమంత్రి కిరణ్ పట్టించుకోవడం లేదని అన్నారు. తన ప్రశ్నలపై ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల కోసం ఒక్క సంక్షేమ పతకాన్ని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు సీఎం కిరణే కారణమని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నారని, ప్రజల సమస్యలపై స్పందించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తన వాదన స్పష్టం చేయకుండానే చంద్రబాబు బస్సు యాత్రలు చేయడం సరికాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

English summary
YSRCP MLA Srikath Reddy said that CM Kiran Kumar Reddy is also one reason for state divide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X