హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్య దీక్షలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Teacher dies in Nellore
హైదరాబాద్/నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జిల్లాలోని నాయుడిపేట సమైక్య శిబిరంలో మంగళవారం విషాదం నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు శంకరయ్య యాదవ్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఆయనను ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారు. గత నెల 22 నుండి సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులు దీక్ష చేస్తున్నారు. శంకరయ్య దీక్షలో రోజు పాల్గొంటున్నారు.

హైకోర్టు వద్ద ఉద్రిక్తత

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు ఎదుట తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. బార్ కౌన్సెల్ ఎదుట సీమాంధ్ర లాయర్లు మౌన దీక్షకు దిగారు. టి లాయర్ల తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఇరు ప్రాంతాల లాయర్లను అరెస్ట్ చేశారు. హైకోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఎపిఎన్జీవోల భవిష్యత్ కార్యాచరణ

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఎపిఎన్జీవోలు మంగళవారం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. నేటి నుంచి రెండు రోజుల పాటు గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. 3న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా, 14న మహిళా ఉద్యోగుల ర్యాలీలు, నిరసనలు, 15న ఎపిఎన్జీవో కార్యవర్గ సమావేశం, 16న సమైక్య రాష్ట్ర పరిక్షణ వేదిక సమావేశం, 17 నుంచి ఇందిరాపార్క్, ఢిల్లీలో దీక్షలు, ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.

గవర్నర్‌తో రాఘవులు భేటీ

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో అనిశ్చితిని తొలగించాలని గవర్నర్‌కు వినతి చేశారు.

English summary
One teacher dead in SPS Nellore district on Tuesday, who is participating in United AP stir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X