హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నెలలో జగన్‌పార్టీ 3ప్రకటనలు: వర్షాన్ని ఆపే అనిల్‌కి..'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSRCP announced 3 decisions in a month: TDP
హైదరాబాద్/నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క నెలలోనే మూడు నిర్ణయాలను ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నర్సి రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్ట నేతలు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయడం మాని బ్రదర్ అనిల్ కుమార్‌కు లేఖలు రాస్తే మంచిదన్నారు.

సువార్త సభల్లో కురిసే వర్షాన్ని కూడా ఆపానని చెప్పుకొంటున్న అనిల్ రాష్ట్ర విభజనను ఆపలేరా అని ఆయన ప్రశ్నించారు. ఒక నెలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు నిర్ణయాలు ప్రకటించిందన్నారు. ఆర్టికల్ బి ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని ఒకసారి, రెండు ప్రాంతాలకు సమన్యాయం అని మరోసారి, సమైక్యాంధ్ర అంటూ ఇంకోసారి ఇలా మూడు రకాలుగా మాట్లాడారన్నారు.

చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పైన అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

రాహుల్ కోసం కాదు: బాలరాజు

రాష్ట్ర విభజన తమ పార్టీ నాయకులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాదని మంత్రి బాలరాజు వేరుగా అన్నారు. రాహుల్ కోరుకుంటే ఇప్పుడే ప్రధాని కాగలరన్నారు. సీమాంధ్రలో ప్రజలు స్వచ్చంధంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు.

English summary
Telugudesam Party senior leader Narsi Reddy on Tuesday said YSR Congress Party announced three decisions in a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X