వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్: పిటిషన్ల కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. పోలవరం టెండర్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను బుధవారం ఉదయం హైకోర్టు కొట్టివేసింది. పోలవరం టెండర్లను ప్రభుత్వం అనుభవం లేని ట్రాన్స్‌ట్రాయ్‌కు అప్పగించిందంటూ కొన్ని కంపెనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

పోలవరం ప్రాజెక్టు టెండర్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి టెండర్లను కేటాయించింది. ఈ కంపెనీకి అనుకూలంగా హైకోర్టు నిర్ణయం వెలువరించింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి టెండర్లను అప్పగించడాన్ని సవాల్ చేస్తూ సోమ కంపెనీ నిరుడు నవంబర్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత మధుకాన్, మహాలక్ష్మి కంపెనీలు ఇంప్లీడ్ అయ్యాయి.

పోలవరం ప్రాజెక్టు టెండర్లపై ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని, ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టు కాబట్టి దాన్ని నిలువరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి టెండర్లను సాధించిందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, తాము సమర్పించిన పత్రాలన్నీ సరైనవేనని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వాదించింది.

గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడుతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోలవరం ప్రాజెక్టును తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నారు. దాని డిజైన్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

English summary

 High Court has given green signal to Polavaram project, takenup on Godavari river in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X