వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల మహేష్..విరాళాలతో ఆదుకోండి..!

Google Oneindia TeluguNews

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు మహేష్. వయస్సు ఆరేళ్లు. గుండెసంబంధిత వ్యాధితో బాధపడుచున్నాడు. చక్కగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయస్సులో ఈ చిన్నారి ఎంతో ఆవేదన చెందుతున్నాడు. తనకు గుండెలో భరించలేని నొప్పిగా ఉందంటూ ప్రతిరోజూ ఆ తల్లిదండ్రులకు చెబుతుంటే వారు విని కుమిలిపోతున్నారు తప్పితే అబ్బాయికి చికిత్స చేయించేందుకు వెనకాడుతున్నారు. కారణం వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి. ఇక తమ బిడ్డను బతికించే బాధ్యత భారం ఆ భగవంతుడిపైనే వేసిందని చెబుతోంది ఆ తల్లి. భగవంతుడు అందరి అవసరాలు తీరుస్తాడని తెలుసు.. కానీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుతాడా లేదా.. అని ఆ తల్లి ప్రశ్నిస్తున్న తీరు చూస్తే కళ్లల్లో నీళ్లు ఆగవు. తన ప్రార్థనలను భగవంతుడు ఎందుకు ఆలకించడం లేదో తనకు అర్థం కావడం లేదని ఆ తల్లి చెబుతోంది.

ఇక మహేష్ తండ్రి రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. ఓ రోజు ఇంటికి చేరుకున్న ఆ తండ్రి చిన్నారి నొప్పితో ఏడవటం చూసి భరించలేకపోయాడు. ఊపిరి తీసుకోలేకపోతున్నానంటూ ఆ చిన్నారి చెప్పినప్పుడల్లా తమ ఊపిరి ఆగిపోతున్నట్లుగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కంగారు పడ్డ తను చిన్నారిని తీసుకుని హాస్పిటల్‌కు పరుగులు తీశానని చెప్పాడు. అక్కడ ఇంజెక్షన్‌ ఇవ్వడంతో కొన్ని గంటల తర్వాత నొప్పి తగ్గిందని తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అయితే కొన్ని రోజుల తర్వాత చిన్నారికి విపరీతమైన జ్వరం వచ్చిందని చెప్పాడు ఆ తండ్రి. జ్వరంను నయం చేసేందుకు కొన్ని ఇంట్లో తయారు చేసిన మందులను ఇచ్చేవారమని చెప్పాడు. అయితే ఏదీ పనిచేయలేదని మళ్లీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు చాలా పరీక్షలు నిర్వహించారని వెల్లడించాడు.

6 Years old Mahesh suffering from rare heart disease,Help and save him

ఇక టెస్టుల ఫలితాలు వచ్చాకా తను తన భార్య నాగమణి షాక్‌కు గురైనట్లు చెప్పాడు. తన కొడుకు ఒక అరుదైన గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయామని వెల్లడించాడు. తన భార్య ఒకరోజంతా బాధతో ఆహారం తీసుకోలేదని చెప్పారు. నిత్యం ఏడుస్తూ తన బాధను భగవంతుడితో చెప్పుకునేదని చిన్నారి తండ్రి చెప్పాడు. ఇద్దరినీ అలా చూడటంతో తన గుండె బాధతో పగిలిపోయేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇక చిన్నారి మహేష్‌కు అర్జంట్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారని దానికి రూ.4.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఏమి చేయాలో తెలియడం లేదని మహేష్ తండ్రి చెప్పాడు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం తమదని అంత డబ్బుల తాను ఎక్కడి నుంచి తీసుకురాగలనని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.

6 Years old Mahesh suffering from rare heart disease,Help and save him

ఇక మహేష్ సర్జరీ కోసం అంత డబ్బు తాము తీసుకురాలేము కనుక ముందుగా మందులు వాడాలని సూచించినట్లు చెప్పారు. అయితే మందులతో నయమయ్యే జబ్బుకాదని అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుందని వైద్యులు చెప్పినట్లు మహేష్ తండ్రి చెప్పాడు. సర్జరీ చేస్తే మాత్రమే తమ బిడ్డ తమకు దక్కుతాడని తండ్రి చెప్పాడు. ఇప్పటికే రెండు నెలల సమయం దాటిపోయిందని డబ్బులు సేకరించేందుకు ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెప్పాడు.

6 Years old Mahesh suffering from rare heart disease,Help and save him

ఇక గత కొన్ని రోజులుగా మహేష్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు తండ్రి. తన శరీరంపై ఉష్ణోగ్రత తరుచూ పెరిగిపోతూ ఉందని చిన్నారి ఐదు నిమిషాల పాటు నడిస్తే తన శరీరం నీలంరంగులోకి మారుతోందని చెప్పాడు. ఈ వయస్సులో చిన్నారులంతా స్కూళ్లకు వెళ్లి చదువుకుంటూ ఆటలాడుకుంటుండగా తన బిడ్డ మాత్రం మంచానికే పరిమితమవడం చాలా వేధిస్తోందని చెప్పాడు. ఇక మందులు ఎంతమాత్రం పనిచేయవని డాక్టర్లు తేల్చేశారని ఇక కేవలం సర్జరీతోనే బిడ్డ ప్రాణాలు దక్కుతాయని చెప్పినట్లు మహేష్ తండ్రి వెల్లడించాడు.

తను రోజువారీ కూలీనని చెప్పిన మహేష్ తండ్రి తనకొచ్చే డబ్బులతో కుటుంబం మాత్రమే గడుస్తుందని చెప్పాడు. మహేష్ సర్జరీకి కావాల్సిన డబ్బులు సంపాదించడం లేదా సేకరించడం తనకు అసాధ్యమని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. తన బిడ్డ ప్రాణాలను కాపాడాలని మహేష్ తండ్రి కోరుతున్నాడు. మీకు చేతనైనంతలో విరాళాలు ఇచ్చి చిన్నారి మహేష్ ప్రాణాలను నిలపాలని వేడుకుంటున్నాడు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెబుతున్నాడు మహేష్ తండ్రి.

Recommended Video

3 Minutes 10 Headlines | Coronavirus Outbreak | Amrutha Pranay Father Maruthi Rao | Oneindia

"Fundraising for cancer is a way to support medical treatment cost. Ketto is a largest crowdfunding website that supports crowdfunding for cancer, heart and many other treatments."

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X