వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక ఇబ్బందులు లేకుండా రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? అయితే.. ఇది మీ కోసమే!

Google Oneindia TeluguNews

మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా జీవనాన్ని గడపటానికి నెలవారీ జీతం ఒక్కటే సరిపోదు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఏటా సంస్థ చెల్లించే ఇంక్రిమెంట్లు ఏ మాత్రం చాలవు. నెలవారీ వేతనాల మీదే ఆధారపడే ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి వస్తే.. ఆ తరువాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఊహించలేం. పదవీ విరమణ అనంతరం ఇబ్బందులు లేకుండా గడపడానికి అవసరమైన డబ్బులను దాచుకోకుండా రిటైర్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. రిటైర్ అయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు జీవితాన్ని విశ్రాంతిగా గడపనీయకుండా చేస్తాయి.

నెల చివరి వారం వరకు డబ్బులు చేతుల్లో లేకపోతే..

చాలీచాలని జీతాలు రోజువారీ ఖర్చులకే సరిపోతాయి. నెల చివరి వారం వచ్చే సరికి జేబుల్లో నయా పైసా ఉండదు. ఒక్క రోజు జీతం రావడం ఆలస్యమైనా రోజువారీ ప్రణాళికలన్నీ తలకిందులు అవుతాయి. నెల చివరి వరకూ చేతుల్లో డబ్బులు ఉండాలంటే కొన్ని ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవడం తప్పనిసరి. ఉద్యగం చేస్తూనే ఖాళీ సమయాల్లో అదనపు సంపాదన ఉండేలా ప్రణాళికలు వేసుకోవాలి. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంటి వద్దే ఉంటూ సంపాదించడానికి గల మార్గాలను వెదుక్కోవడం వల్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. దుబారా ఖర్చులను అదుపు చేయాలి. అనవసరంగా ఖర్చు చేయడం వల్ల మిగిలే మొత్తం పొదుపు కోసం మళ్లించానికి ఉపయోగపడుతుంది.

7 Signs That You Are Not Earning Enough To Retire Comfortably

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటే..

చాలామందికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. లిమిట్ దాటేంత వరకూ క్రెడిట్ కార్డును వినియోగిస్తుంటారు. నెల చివరి వారం వచ్చే సరికి అప్పుల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ దుబారా చర్యలకు నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితులు ప్రతి నెలా ఎదురవుతుంటే రిటైర్ మెంట్ తరువాతి జీవితం ఇబ్బందుల్లోొ పడినట్టే అవుతుంది. అందుకే- ఆర్థిక క్రమ శిక్షణ గురించి ప్లాన్ చేయాలి. డబ్బును ఖర్చు చేయొచ్చు గానీ వృథాగా కాదు. జీతం చేతికి అందిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఈఎంఐలను చెల్లించడం. రెండోది- ఇంటి అద్దె లేదా ఇతర గృహోకరణాల కొనుగోలు కోసం అవసరమైనంత వరకు కేటాయించడం. మూడవది- ఎంతో కొత్త మొత్తాన్ని పొదుపు చేయడం. అత్యవసర పరిస్థితుల్లో ఈ పొదుపు మొత్తం ఉపయోగపడవచ్చు. రిటైర్ మెంట్ తరువాతైనా ఆ సొమ్ము వినియోగించుకోవచ్చు.

అత్యవసర అవసరాల కోసం డబ్బులు లేకపోతే..

సాధారణంగా- అధికాదాయం ఉన్న వాళ్లు ప్రతి మూడు నెలలకు ఓ సారి తమ నెల వేతనం మొత్తాన్నీ పొదుపు చేస్తుంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు రావడం, ఆసుపత్రి అవసరాలు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురవుతుంటాయి. వైద్యపరమైన అవసరాలు వంటి ఎమర్జెన్సీ కోసం జీతంలో కొంత మొత్తాన్ని ప్రతినెలా పొదుపు చేసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ఈ పొదుపు మొత్తం ఉపయోగపడుతుంది. హెచ్ డీఎఫ్ సీ లైఫ్ క్లిక్ 2 వెల్త్ పథకం ఇలాంటిదే. ఆర్థిక ఎమర్జెన్సీలో మిమ్మల్ని సంరక్షించేలా చేస్తుంది ఈ పథకం.

ఎలాంటి పొదుపు గానీ, పెట్టుబడులు గానీ లేకపోతే..

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఒక్కటే ఉద్యోగుల పెట్టుబడిగా పరిగణిస్తారు. డబ్బులను పొదుపు చేయలేకపోతే రిటైర్మెంట్ తరువాతి జీవితాన్ని ఉల్లాసంగా గడపలేరు. పొదుపు చేయాలనుకున్న సందర్భంలో మన లైఫ్ స్టైల్ కు అనుగుణంగా సరికొత్త ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు ఏమున్నాయనేది అన్వేషించాలి. అలాంటి పొదుపు లేదా ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లలో ఒకటి- హెచ్ డీఎఫ్ సీ లైఫ్ క్లిక్ 2 వెల్త్ యుఎల్ఐపీ. ఈ ప్లాన్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు.

రుణాలను తీసుకోవచ్చా?..

జీ20/ఓఈసీడీ ఇన్ఫీ అడల్ట్ ఫైనాన్షియల్ లిటరసీ జీ 20 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది భారతీయులు స్నేహితులు, లేదా ఇతర కుటుంబ సభ్యులకు రుణాలు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తోటి వారికి అప్పులు ఇవ్వడం కంటే వాటిని ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్ లో ఉన్న అవకాశాలను గుర్తించాలి. అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లపై డబ్బులను పెట్టుబడిగా పెట్టవచ్చు.

హాలీడేలు లేదా భారీ ఖర్చులు చేయడానికి అవకాశం లేదా?..

సెలవుల్లో సరదాగా గడప డానికి డబ్బులు సరిపోక అనేకమంది ఇబ్బందులు పడుతుంటారు. హాలిడే ఖర్చులను దుబారాగా భావిస్తుంటారు. ఖర్చుకు అనుగుణంగా హాలిడే ప్లాన్లన్లు రూపొందించుకోవడం వల్ల దుబారాకు కల్లెం వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతి రోజులను సరదాగా గడపటానికి ఈ ఇన్వెస్ట్ మెంట్ ఉపయోగపడుతుంది. మీ కోసం మీరు జీవించేలా చేస్తుంది ఈ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. పొదుపు చేయదగ్గ సంపాదన గానీ ఆదాయం గానీ లేదని అనుకోవడం పొరపాటు. ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో తెలియని పరిస్థితి తలెత్తుతుంది. అధిక సంపాదన కోసం సమయాన్ని కేటాయించడం, దుబారా ఖర్చులను నియంత్రించడం, ఇన్వెస్ట్ చేయడం వంటి చర్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని గడపడానికి బాటలు వేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X