వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ఉఠావో,ఇండియా పడావో: గ్రామీణ చిన్నారులకు ఇంగ్లీష్ బోధించే కార్యక్రమంకు శ్రీకారం

Google Oneindia TeluguNews

మనదేశానికి చెందిన గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదనే ఓ అపవాదు ఉంది. గ్రామాల్లో నివసించే విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండదని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గానీ, ప్రావీణ్యంగానీ ఉండదని అంటుంటారు. ఈ అపవాదును తొలగించడానికి ప్రముఖ హెయిర్ ఆయిల్ కంపెనీ నీహార్ నేచురల్ శాంతి ఆమ్లా సంస్థ యాజమాన్యం నడుం బిగించింది. "ఫోన్ ఉఠావో, ఇండియా పఢావో" క్యాంపెయిన్ ను చేపట్టింది. గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యాన్ని కల్పించడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. ఫోన్ ఉఠావో ఇండియా పడావో అనే ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న చదువుకున్న యువతను గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్న వెనకబడిన వర్గాలకు చెందిన చిన్నారులతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునే చిన్నారులు ఈ పట్టణ ప్రాంతపు యువతతో కనెక్ట్ అవుతారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 55 వేల నిమిషాల పాటు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తారు.

మీకు వచ్చే ఫోన్‌కాల్‌ను తీసుకుని ఇందులో భాగస్వాములు కావాలని ఈ హెయిర్ ఆయిల్ సంస్థ కోరుతోంది.తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే చిన్నారుల స్థితిగతులను విద్య ద్వారా మార్చాలని కోరుతోంది. ఇందుకు వారంలో ఒక్కసారి వారికోసం 10 నిమిషాల సమయం కేటాయించాల్సిందిగా హెయిర్ ఆయిల్ సంస్థ కోరుతోంది. "ఫోన్ ఉఠావో, ఇండియా పడాఓ" కార్యక్రమం ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకునే పట్టణప్రాంత యువత చిన్నారుల విద్యకోసం 10 నిమిషాలు కేటాయిస్తామని కమిట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పదినిమిషాల్లో ఫోన్ ద్వారా వారికి స్పోకెన్ ఇంగ్లీష్‌ను నేర్పించాల్సి ఉంటుంది. ఈ చిన్నారులు ఓ టోల్ ఫ్రీ ఐవీఆర్ నెంబరు నుంచి ఫోన్ చేసి ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాలంటీర్లతో కనెక్ట్ అవుతారు.

A Call for better India: Ab bas ‘Phone Uthao, India Padhao’

ఈ ఫోన్‌కాల్ సమయంలో విద్యార్థులు తాము ఇంగ్లీషులో నేర్చుకున్నది చెప్పడమో లేక వారి స్కూల్లో ఇంగ్లీషు క్లాసులో నేర్చుకున్న అంశాలు చెప్పడమో చేస్తారు. లేదా ఏదైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇలా 10 నిమిషాలు మాట్లాడటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఇంగ్లీషును చాలా సింపుల్‌గా సరదా పద్ధతిలో నేర్పించాలన్నదే తమ ఐడియాగా కంపెనీ పేర్కొంది. అది కూడా ఉచితంగా నేర్పించడం ముఖ్యమైనది. అయితే చాలామందికి ఇంగ్లీషు మాత్రమే ఎందుకనే సందేహం కలగొచ్చు. అయితే ఇంగ్లీషును యూనివర్శల్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తున్నాము.అంతేకాదు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీషు మాట్లాడటం తెలిస్తే చాలు అనేది కంపెనీ అభిప్రాయం. అంతేకాదు చాలా చోట్ల ఇంగ్లీషు మాట్లాడటం వచ్చిన వారికి ఉద్యోగవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

నీహార్ శాంతి పాఠశాల ఫన్వాలా అనే కార్యక్రమం కింద ఓ సంస్థ ద్వారా నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అసలు నీహార్ శాంతి పాఠశాల ఫన్‌వాలా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే పిల్లలకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీషు నేర్పించడమని కంపెనీ వెల్లడించింది.గత కొన్నేళ్లుగా నీహార్ శాంతి పాఠశాల ఫన్‌వాలా కింద దాదాపు 7500 గ్రామాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం నిర్వహించామని ఇందుకోసం 3 లక్షలకు పైగా విద్యార్థుల నుంచి 8.5 లక్షలకు పైగా ఫోన్‌ కాల్స్ చేసినట్లు కంపెనీ వివరించింది.

అమ్మాయిలను చదివించండి అనే ఎన్జీఓ సంస్థతో కూడా నీహార్ నేచురల్ శాంతి ఆమ్లా సంస్థ జతకట్టింది. ఈ కార్యక్రమం కింద పబ్లిక్ ప్రైవేట్ వనరుల ద్వారా అట్టడుగున ఉన్న బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తుంది.తద్వారా విద్య మరియు పాఠశాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. బాలికలందరికీ ప్రవర్తనా, సామాజిక మరియు ఆర్ధిక పరివర్తనను సాధిస్తుంది. ఇక ఇప్పటికీ కొన్ని లింగ విబేధాలు కనిపిస్తున్నాయి. అట్టి వాటిని రూపుమాపి నాణ్యమైన విద్యను అదించడంలో సమాన అవకాశాలు కల్పించి దేశంలోని బాలబాలికలను తీర్చిదిద్దుతుందని సంస్థ తెలిపింది.

గతేడాది ధార్, మధ్యప్రదేశ్, ఉదయ్‌పూర్, రాజస్థాన్‌లలో ఈ కార్యక్రమం ద్వారా 2లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందారని నీహార్ నేచురల్ శాంతి ఆమ్లా సంస్థ తెలిపింది.

చిన్నారుల జీవితాలను మార్చేందుకు చిన్న మంత్రం పాటిద్దాం. ఫోన్ ఉఠావో ఇండియా కో పడావో కార్యక్రమం ఇంగ్లీషు మాట్లాడగలిగే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక చిన్నారి సొంతంగా నైపుణ్యంను పెంపొదించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది

ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మీకు మా నుంచి వచ్చే ఫోన్‌ కాల్ తీసుకుని ఒక చిన్నారి జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చేందుకు సహకరించండి. కేవలం 10 నిమిషాలు కేటాయించి మంచి మనస్సుతో పేద పిల్లల జీవితాలను మార్చడంలో మీరు భాగస్వాములు అవ్వండి. ఈ కింది లింకును క్లిక్ చేసి వాలంటీర్‌గా నమోదు చేసుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X