వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరిసిన ప్రీతిజింతా: 10 నిమిషాల్లో ఎన్ని వేరియేషన్‌లో: డబుల్ సూపర్ ఓవర్‌..విన్నర్

|
Google Oneindia TeluguNews

దుబాయ్: క్రికెట్.. ఊహకు అందని గేమ్. చివరి వరకూ ఎలాంటి అద్భుతమైనా జరగొచ్చు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచిందా మ్యాచ్. ఆదివారం రాత్రి దుబాయ్ స్టేడియంలో అభిమానులకు అందించిన డబుల్ ధమాకా అందించిందా మ్యాచ్. ఒక మ్యాచ్‌లో ఒక సూపర్ ఓవరే అభిమానులను టెన్షన్ పెడుతుంటుంది. అలాంటిది- ఒకే మ్యాచ్‌లో రెండు రెండు సూపర్ ఓవర్లు పడితే..అది హైఓల్టేజే అవుతుంది. ప్రతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠత. ఊపిరి తీసుకోనివ్వని ట్విస్ట్. నెక్స్ట్ బాల్‌ పరిస్థితేంటీ?, ఎన్ని రన్స్ వస్తాయి?, గెలిచేదెవరు?..ఇవే ప్రశ్నలు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌ను మరిచిపోయేలా చేసింది ఇది.

మెరిసిన ప్రీతిజింతా..

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయ్ వేదికగా సాగిన ఆ మ్యాచ్‌లో తన జట్టు విజయం సాధించడం పట్ల ప్రీతిజింతా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సూపర్ ఓవర్ కొనసాగుతున్నంత సేపూ ఆమె ఎన్నో వేరియషన్లను కనపర్చారు. ప్రతి బంతికి ఆమె హైటెన్షన్‌కు గురయ్యారు. చివరికి-విజయం తన జట్టును వరించడంతో గాల్లో తేలిపోయారు. ఇలాంటి మ్యాచ్‌ ఇక ముందు చూడలేమంటూ కామెంట్స్ చేశారు.

176 పరుగుల లక్ష్యంతో..

దుబాయ్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీమ్ మొత్తం 20 ఓవర్లలు ఆరు వికెట్లను నష్టపోయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ కూడా ఆరు వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాధించింది. ఎప్పట్లాగే పంజాబ్ ఇన్నింగ్‌లో కేఎల్ రాహుల్ ఒక్కడే మెరిశాడు. 51 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 77 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు క్రిస్ గేల్, నికొలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాణించలేకపోయారు.

తొలి సూపర్ ఓవర్ టై..

పంజాబ్ టీమ్ సరిగ్గా 176 పరుగులు చేయడంతో విజేత నిర్ణయించడానికి సూపర్ ఓవర్ అవసరమైంది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. యార్కర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్‌ వేశాడు. సూపర్ ఓవర్‌లో అయిదు పరుగులే వచ్చాయి.
రెండో బంతికి పూరన్ డకౌట్ అయ్యాడు. సూపర్ ఓవర్‌లో అతను డకౌట్ కావడం ఇది రెండోసారి. ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ ఎల్బీ అయ్యాడు. ఆరు పరుగుల లక్ష్యంతో ఆడిన ముంబై ఇండియన్స్ సరిగ్గా అయిదు పరుగులే చేయగలిగింది. షమీ వేసిన సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ధారాళంగా పరుగులు చేయలేకపోయారు.

గేల్‌తో పంజాబ్ జిగేల్

రెండో సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్ ఆడిన బ్యాట్స్‌మన్‌, బౌలర్‌కు మరో సూపర్ ఓవర్ ఆడే ఛాన్స్ లేదు. దీనితో ముంబై ఇండియన్స్ తరఫున కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యా సెకండ్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగారు. పంజాబ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్‌లో ఒక వికెట్ సహా 11 పరుగులు వచ్చాయి. 12 పరుగుల లక్ష్యంతో క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్ క్రీజ్‌లోకి వచ్చారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన సెకెండ్ సూపర్ ఓవర్ తొలిబంతిని క్రిస్ గేల్ సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి గేల్ సింగిల్ తీయగా.. మూడో బంతిని మయాంక్ అగర్వాల్ ఫోర్‌కు తరలించడంతో స్కోర్ టై అయింది. తరువాతి బంతిని మళ్లీ ఫోర్ బాదడంతో పంజాబ్ విజయాన్ని అందుకుంది.

చిన్నపిల్లలా


రెండు సూపర్ ఓవర్లు సాగినంత సేపూ ఉత్కంఠతకు గురైన ప్రీతిజింతా.. తన జట్టు గెలిచే సరికి చిన్నపిల్లలా మారిపోయారు. వీఐపీ బాక్స్‌లో నుంచి మ్యాచ్‌ను చూస్తూ కనిపించిన ఆమె మయాంక్ అగర్వాల్ విన్నింగ్ షాట్ కొట్టగానే.. ఇక ఆగలేకపోయారు. టీమ్ మేనేజ్‌మెంట్‌ మెంబర్స్‌ను హగ్ చేసుకున్నారు. అప్పటిదాకా నరాలు తెగే ఉత్కంఠతను అనుభవించిన ప్రీతి జింతా.. విన్నింగ్ షాట్ తరువాత ఇక గాల్లో తేలిపోయారు.

English summary
Kings XI Punjab Franchiese Preity Zinta expressed her happiness after team won the double super over match against Mumbai Indians at Dubai. She wrotes actions speak louder than words as words fail me completely. Two super overs ? OMG ! I’m still shaking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X