ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆపరేషన్ ఆడెళ్లు : గ్రేహౌండ్స్ ఉచ్చు! - అందుకే ఆదిలాబాద్‌లోనే డీజీపీ మకాం? - అడవిలో ఏం జరుగుతోంది??

|
Google Oneindia TeluguNews

కరోనా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని, తెలంగాణలో మళ్లీ విస్తరించేందుకు నిషేధిత మావోయిస్టు పార్టీ కర్యకలాపాలు నిర్వహిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గత నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మకాం వేయడం కీలకంగా మారింది. నక్సల్స్ కదలికలకు సంబంధించి పోలీసులు పక్కా సమాచారాన్ని రాబట్టారని, ఏ మాత్రం పొరపాటుకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే పోలీస్ బాస్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.

కరోనా విలయం: భారత్ ప్రపంచ రికార్డు - 9నెలల్లో ఇదే హయ్యెస్ట్ - బ్రెజిల్‌ను వెనక్కునెట్టేస్తూ..కరోనా విలయం: భారత్ ప్రపంచ రికార్డు - 9నెలల్లో ఇదే హయ్యెస్ట్ - బ్రెజిల్‌ను వెనక్కునెట్టేస్తూ..

ఆపరేషన్ ఆడెళ్లు?

ఆపరేషన్ ఆడెళ్లు?

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌, స్థానిక కేడర్‌ కలిసి ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. జూలై 15న మంగి ఆడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో కీలకమైన డైరీ లభ్యమైందని, అందులోని వివరాల ప్రకారం మావోయస్టులకు సహకరిస్తోన్నదాదాపు 10 మందిని గుర్తించామని జిల్లా ఇన్ చార్జి ఎస్పీ తెలిపారు. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం.. ఆడెళ్లును సజీవంగానో, నిర్జీవంగానో పట్టుకునేందుకు గ్రేహౌండ్స్‌ బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే డీజీపీ నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మాకం వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కరోనా వేళ చప్పుడు కాకుండా..

కరోనా వేళ చప్పుడు కాకుండా..

మార్చిలో కరోనా ప్రారంభం నుంచే.. కరోనా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మావోయిస్టులు కర్యకలాపాలు ముమ్మరం చేశారని, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ కార్యకలాపాలను ఆడెళ్లు అలియాస్ భాస్కర్‌ సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జులై 15నాటి ఎదురుకాల్పుల తర్వాత కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో భాస్కర్‌ కదలికలు ఉన్నట్లుగా తెలియడంతో అతణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. వందలాది మంది గ్రౌహౌండ్స్ బలగాలు.. అడవులను, ఆదివాసీ గ్రామాలను జల్లెడపడుతున్నాయని, ఆడెళ్లు తలదాచుకుని ఉండొచ్చని భావిస్తోన్న ప్రాంతాల్లో అణువణువూ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం

డీజీపీ కీలక సమీక్షలు..

డీజీపీ కీలక సమీక్షలు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ పుంజుకోకుండా పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పోలీసులకు సూచనలు ఇచ్చేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత బుధవారం నుంచి ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంటూ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఏరియల్ సర్వే, జిల్లా ఎస్పీలతో సమీక్షలు నిర్వహించిన ఆయయ.. శుక్రవారం రాత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తిర్యాణీ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి.. మంగీదళం, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. మరోవైపు ఐజీ నాగిరెడ్డి సైతం నిర్మల్‌ ఏజెన్సీ ప్రాంతంలోని స్టేషన్లను సందర్శించారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో కూడా పోలీసులు హైఅలెర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత ఆదిలాబాద్‌, కరీనంరగ్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎస్‌హెచ్‌వోల బదిలీలు చోటుచేసుకోవడం గమనార్హం.

Recommended Video

Sonu Sood Helps A Tribal Girl In Chhatisgarh
బంద్ పిలుపు.. ప్రాజెక్టుల వద్ద సెక్యూరిటీ పెంపు

బంద్ పిలుపు.. ప్రాజెక్టుల వద్ద సెక్యూరిటీ పెంపు

ఈ నెల 3న గుండాల లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత హరిభూషణ్‌ గన్‌మన్, యాక్షన్‌ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని లేఖలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. ఆదివారం ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునింది. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌), సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద పోలీసులు భద్రత పెంచారు.

English summary
situation in the joint Adilabad district turns tensed while DGP M. Mahender Reddy has been staying here for the last four days and is closely reviewing the anti naxal operation. it is reported that telangana police Greyhounds' forces trying to capture Maoist party state committee member Mylar Adellu alias Bhaskar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X