ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలికాలం: శునకం పాలు తాగుతున్న లేగదూడ, వీడియో వైరల్.. ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

బ్రహ్మాం గారూ చెప్పినట్టే జరుగుతున్నాయి. కలికాలంలో మాటకు నమ్మకం లేకుండా పోతోంది. కొందరు వరసలు మరచిపోతున్నారు. వింతలు- విశేషాలు వెలుగుచూస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ లేగదూడ.. ఏకంగా శునకం పాలు తాగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇదీ నిజం. ఆ డాగ్ కూడా తన పిల్లల మాదిరిగానే పాలు ఇస్తూ.. దూడ కడుపు నింపుతోంది. ఈ వీడియోనే ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. తెగ ట్రోల్ అవుతోంది. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పదండి.

ఆవు వద్దకు నో, డబ్బా పాలు కూడా వద్దు

ఆవు వద్దకు నో, డబ్బా పాలు కూడా వద్దు


కొద్ది రోజుల క్రితం తల్లి లేని లేగ దూడను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల జైశ్రీరాం గోశాలలో వదిలిపెట్టారు. ఆ దూడ ఇతర ఆవుల పాలు తాగి పెరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ లేగదూడ ఏ ఆవు దగ్గర పాలు తాగడం లేదు. డబ్బా పాలు కూడా ముట్టలేదు. పాలు లేకపోయినా ఆ లేగ దూడ హుషారుగా కనిపించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. కానీ అందులో ఓ కిటుకు ఉంది.

శునకం పాలు ఇవ్వడంతో

శునకం పాలు ఇవ్వడంతో

ఏం జరుగుతుందని వారు గమనించారు. గోశాలలో గల ఓ కుక్క పాలు తాగుతూ లేగదూడ కనిపించింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు. గత కొన్ని రోజుల నుండి ఆ లేగ దూడ కుక్కల తో కలిసి తిరగడం, వాటితోనే కలిసి పడుకోవడం చేస్తోంది. కుక్క కూడా జాతి వైరం మరిచి ఆ తల్లి లేని లేగ దూడను అక్కున చేర్చుకొని తన పాలతో కడుపు నింపుతోంది. మిగతా శునకాలు కూడా సఖ్యంగా మెలగుతున్నాయి. జాతి వైరం మరచి శునకం, దూడ మెలగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మమకారం

మమకారం


కొన్ని సందర్భాల్లో ఆవులు/ శునకాలే దూడలు/ కూనలకు పాలు ఇవ్వవు. చాలా ఇబ్బంది పెడతాయి. కానీ ఇక్కడ శునకం మాత్రం లేగ దూడపై మమకారం చూపిస్తోంది. తన పాలను ఇస్తూ అదీ ఎదిగేందుకు దోహదం చేస్తోంది. ఇదీ విని/ చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. అయ్యో ఇదేం విచిత్రం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటివి కామనే అని మరికొందరు అంటున్నారు. దూడలకు శునకాలు, కూనలకు ఆవులు పాలు ఇస్తున్నాయని చెబుతున్నారు. ఇదివరకు ఓ తల్లి కూడా దూడకు పాలు ఇచ్చిందని గుర్తుచేశారు.

English summary
calf drinking dog milk at adilabad. someone post vedio social media facebook went vedio viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X