ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ సిద్దాంతాల సాకారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఇంద్రకరణ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మ‌హాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మంచిర్యాల చౌరస్తా వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఆయన, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్‌బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి కొత్త మార్క్ పాలిటిక్స్టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్‌బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి కొత్త మార్క్ పాలిటిక్స్

ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి, అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ చూపిన పోరాట మార్గం మ‌నంద‌రికీ ఆదర్శనీయ‌మ‌న్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి అని, గాంధీజీ చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.

everyone should come forward to fulfill the principles of the Mahatma Gandhi : Indrakrishnan Reddy

మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహ స్పూర్తితోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. ఇక ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి అవకాశం ఉంటుందనే భావనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

మ‌రోవైపు ప్లాస్టిక్ వాడకం నుంచి ప్రజలను దూరం చేయటంతోపాటు.. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. ప్లాస్టిక్ నియంత్ర‌ణకు అంద‌రూ స‌హాక‌రించాల‌ని మంత్రి కోరారు.

English summary
Telangan Minister Indrakrishnan Reddy, called everyone should to come forward to fulfill the principles of the Mahatma Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X