video viral:హవ్వా.. పెట్రోల్‌కి బదులు నీరు, నిలిచిన 20 టూ వీలర్స్.. ఎక్కడ అంటే...?
నిత్య జీవితంలో ఫ్యుయల్ అవసరం ఎక్కువే.. ప్రతీ ఒక్కరూ కనీసం టూ వీలర్.. కొందరికీ ఫోర్ వీలర్ కూడా ఉంటుంది. సో.. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్దకు వెళ్లడం తప్పనసరి.. కానీ కొందరు తప్పుడు రీడింగ్ చూపిస్తున్నారు. మరికొందరు వాటర్ వేస్తూ ఛీట్ చేస్తున్నారు. రోజు ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా మామడ బంకులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది.

వాటర్ పోసి..
మామడలో ఎస్వీ బంక్‌లో ఇలా పెట్రోల్‌కు బదులు వాటర్ పోశారు. అయితే అక్కడి నుంచి బైకు వెళ్లడం లేదు. దీంతో ఏం జరిగిందని చూస్తే భాగోతం బయటపడింది. నీరు పోశారని చూశారు. ఓ పల్సర్ బైక్ ట్యాంక్ నుంచి నీరు వస్తోన్న విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు అక్కడ ఉన్నవారు తాము ఎంత పెట్రోల్ కొట్టించామనో అనే విషయం మాట్లాడుకుంటున్నారు. 300, 400 అంటూ మాట్లాడారు. ఇలా చేస్తారా అని ఫైరయ్యారు.

20 బండ్లు
పెట్రోల్ బంక్ వద్ద దాదాపు 20 బండ్ల వరకు నిలచిపోయాయి. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్న యువకులు బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకే వీడియో తీసి షేర్ చేశారు. అక్కడ ఉన్న యువత మాత్రం ఆగ్రహాంగా ఉంది. తమకు బంక్ నిర్వాహకులు మోసం చేశారని మండిపడ్డారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ నీరు మాత్రం కల్లు మాదిరిగా
వాస్తవానికి బండిలో పెట్రోల్ పోస్తేనే ఓకే.. గ్యాస్ కలిపినా ఇంజిన్‌పై ప్రభావం చూపుతుంది. అయితే వారు ఏకంగా నీరు పోయడం కలకలం రేగింది. అందుకే కాబోలు బైక్ స్టార్ట్ కాలేదు. కల్తీ చేస్తే బండి కొద్దీ దూరం నడిచేది.. కానీ మొత్తానికి వాటర్ పోయడంతో అక్కడే ఉండిపోయాయి. దీంతో వారు ట్యాంక్ విప్పి చూశారు. ఇంకొకరు బాటిల్లో పట్టి చూశారు. అలా కల్తీ నీళ్లు కనిపించాయి. కానీ ఆ వాటర్ మాత్రం తెల్ల కల్లు మాదిరిగా కనిపించాయి. దీంతో అందులో ఏమయినా కెమికల్ కనిపించిందా అనే సందేహాం కలుగుతుంది.