• search
  • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గులాబీ గూటిలో అసమ్మతి గళాలు .. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం

|

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్ గులాబీ జెండా లకు ఓనర్ లమని , ఎవరి దయాదాక్షిణ్యాలతో మంత్రి కాలేదని మాట్లాడితే, ఇక తాజాగా రసమయి బాలకిషన్ మెరిట్ ఉన్న వారు రాజకీయాల్లో ఉండాలి కానీ మెరిట్ లేనివాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో మరో గులాబీ నేత పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. జడ్పీ సమావేశం బహిష్కరణ రూపంలో దానిని తెలియజేశారు. ఇక వరంగల్ జిల్లా నేతలు మాజీ మంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పోటాపోటీగా కాళేశ్వరం సందర్శన నిర్వహించి వారి మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేశారు. ఈ సమయంలో గులాబీ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతోందని, గులాబీ బాస్ అంతర్మథనంలో పడిపోయారని టాక్ వినిపిస్తోంది.

తెలంగాణా సచివాలయం పాత భవనంతో ప్రమాదం .. నిపుణుల కమిటీ తేల్చిందిదే!!

కోనేరుకోనప్ప ధిక్కార స్వరం ... మంత్రిపై ఆగ్రహం .. రీజన్ ఇదే

కోనేరుకోనప్ప ధిక్కార స్వరం ... మంత్రిపై ఆగ్రహం .. రీజన్ ఇదే

ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రస్తుతం ఆయన జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న మంత్రి ఈటెల మాటల తూటాలు పేల్చిన విషయం మరిచిపోకముందు ఎమ్మెల్యే కోనప్ప లొల్లి గులాబీ దళంలో గుబులు పుట్టిస్తోంది. అయితే.. కోనేరు అసంతృప్తి కోపానికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణను అటవీ అధికారిణి అనిత పై దాడి కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇక ఈ సమయంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన తమ్ముడి కోసం ఏమాత్రం సహాయం చేయలేదని కోనేరు కోనప్ప రగిలిపోతున్నారు అని సమాచారం.

 జడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో సహ ఏడుగురు జెడ్పీటీసీలు

జడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో సహ ఏడుగురు జెడ్పీటీసీలు

ఇక ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద , అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప, తన తమ్ముడు జైలుకు వెళ్లడం ఆపలేకపోయిన నేపథ్యంలోనే గులాబీ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తనవల్లే మంత్రి పదవి వచ్చిందని అయినా ఆయన పట్టించుకోలేదని లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలోఎమ్మెల్యే కోనేరు కోనప్పతో సహ ఏడుగురు జెడ్పీటీసీలు కీలక జడ్పీ సమావేశాన్ని బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తమ్ముడి కోసం అన్న ఆదిలాబాద్ గులాబీలో కుంపటి రాజేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

కోనేరు కోనప్ప సోదరులను బీజేపీ ఆపరేషన్ ఆకర్ష అంటుందా ? ఆదిలాబాద్ గులాబీ కుంపటి ఇలాగే ఉంటుందా

కోనేరు కోనప్ప సోదరులను బీజేపీ ఆపరేషన్ ఆకర్ష అంటుందా ? ఆదిలాబాద్ గులాబీ కుంపటి ఇలాగే ఉంటుందా

ఇక ఇంకొక విషయం ఏంటంటే జడ్పీ సమావేశాన్ని బహిష్కరించడం ఒకరకంగా పార్టీ అధిష్ఠానంపై ధిక్కరణ అవుతుంది . ఇప్పటికే అసమ్మతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే గులాబీ బాస్ కేసీఆర్ తల పట్టుకుంటున్నారని టాక్ . మరోవైపు క్యాడర్ బలంగా ఉన్న బిజెపి, బలమైన నాయకుల కోసం ఆదిలాబాద్ జిల్లాలో వేట ప్రారంభించింది. ఇక ఈ క్రమంలో తీవ్ర అసహనంతో ఉన్న కోనేరు సోదరులు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారా ? బీజేపీ నేతలు వారిని బీజేపీలోకి లాగే యత్నం చేస్తారా అన్నది ఆసక్తికర అంశం . ఇక అలా కాకుండా గులాబీ పార్టీలో ఇలాగే అంతర్గత కుమ్ములాటల కు కారణం అవుతారా అన్నది గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో పుట్టిన ఈ ముసలం పార్టీని జిల్లాలో ఏం చెయ్యనుందో అన్న టాక్ వినిపిస్తోంది.

English summary
MLA Koneru Konappa is furious that Minister Indrakaran Reddy has been appointed with the support of him. but minister indrakaran reddy has not stopped his brother Krishna from going to jail. It is in this backdrop that the seven ZPTCs boycotting a key ZP meeting with MLA Koneru Konappa are hotly debated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X