ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల్లో ఇలాంటి సీఐ వేరయా..! దండాలు, గులాబీలతో గాంధీమార్గం

|
Google Oneindia TeluguNews

కాగజ్ నగర్ : పోలీసులంటే తిడతారు. చేతిలో లాఠీ ఉందని కొడతారు. ఇది ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం. కానీ పోలీసుల్లో ఇలాంటి సీఐ వేరయా! అంటూ నిరూపిస్తున్నారు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన సీఐ కిరణ్. ప్రజల సహకారముంటే ఏదైనా చెయొచ్చనే కాన్సెప్ట్ తో వినూత్న ప్రచారానికి తెర లేపారు.

కాగజ్ నగర్ లో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణ యజమానులు.. తమ వస్తువులను రోడ్డు మీద వరకు తెచ్చి పెడుతున్నారు. ఫుట్ పాత్ మీద జనాలు నడవలేనంతగా వస్తువులతో నింపేస్తున్నారు. కొందరు దుకాణాల యజమానులు ఎంతో కొంత డబ్బులు తీసుకుని తమ షాపు ముందు భాగం చిరువ్యాపారులకు కేటాయిస్తున్నారు. అలా రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం సీఐ కిరణ్ దృష్టికి రావడంతో.. ఆయన గాంధీగిరి ఎంచుకున్నారు.

హైదరాబాద్‌లో సొరంగ మార్గం.. కొత్త దారుల అన్వేషణ..!హైదరాబాద్‌లో సొరంగ మార్గం.. కొత్త దారుల అన్వేషణ..!

kagaznagar circle inspector of police gandhi giri

కాగజ్ నగర్ మెయిన్ రోడ్డులోని దుకాణ యజమానులను కలిసి మాట్లాడారు సీఐ. ఇకపై రోడ్ల మీద వరకు వస్తు సామాగ్రి పెట్టొద్దని సూచించారు. దండాలు పెడుతూ, గులాబీలు ఇస్తూ గాంధీమార్గంలో ఆయన చెప్పిన తీరు వ్యాపారులను ఆకట్టుకుంది. సోమవారం (15.04.2019) నుంచి ఫుట్ పాత్ మీద ఎలాంటి వస్తువులు పెట్టొద్దని, జనాలు నడవడానికి అనుకూలంగా ఉండేలా చూడాలని కోరారు. దాంతో వ్యాపారుల నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం.

English summary
Komuram Bheem Asifabad District Khagaz Nagar CI Kiran following different way. He selected gandhi giri for public cooperation. He Went to shops and given roses to businessmens and pleased that dont put items on roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X