• search
 • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లవ్ జర్నీ.. ముంబై టు ఆదిలాబాద్.. ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా..! (వీడియో)

|
  లవ్ జర్నీ.. ముంబై టు ఆదిలాబాద్.. ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా..!

  ఆదిలాబాద్ : ప్రేమ పేరుతో ఛీటింగ్ కామన్ అయిపోయినట్లుగా తయారైంది నేటి పరిస్థితి. ఆకర్షణ మంత్రంతో దగ్గరవుతూ ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అమ్మాయిలను ట్రాప్ చేస్తూ శారీరకంగా వాడుకుంటూ తీరా గర్భం దాల్చాక ప్లేటు ఫిరాయిస్తున్నారు కొందరు. ఆ క్రమంలో కర్ణాటక టు తెలంగాణ వయా ముంబైగా సాగిన ప్రేమకథ చర్చానీయాంశమైంది.

  ముంబైలో చిగురించిన ప్రేమ ఘట్టం ఆదిలాబాద్‌కు చేరింది. ప్రేమించిన ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో తనను వెతుక్కుంటూ లవ్ జర్నీ చేసింది ఓ ప్రేమికురాలు. చివరకు ప్రియుడి గ్రామానికి చేరి మహిళా సంఘాల సాయంతో ధర్నాకు దిగింది.

   ప్రేమ పేరుతో ముగ్గులోకి.. మూడేళ్ల సహజీవనం..!

  ప్రేమ పేరుతో ముగ్గులోకి.. మూడేళ్ల సహజీవనం..!

  కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల సునీతకు తల్లిదండ్రులు లేరు. ఆ క్రమంలో తనను ఆదుకునేవారు లేక జీవనపోరాటంలో ముంబైకు చేరుకుంది. అక్కడ ఓ అపార్టుమెంటులోని పలువురి ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. అదే అపార్టుమెంటులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దస్తురాబాద్‌ మండలం బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేశ్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అలా ఇద్దరు కలిసి ఒకే రూములో సహజీవనం చేస్తూ కాపురం చేశారు. దాంతో మూడుసార్లు గర్భం దాల్చింది.

  డైరెక్టర్ రాజమౌళి RRRలో తల్లి వేషం మీదే.. 50 లక్షలు ఫసక్.. లాయర్‌కు కన్నం..!

   ప్రియుడి ఇంటికి చేరిన ప్రేమకథ

  ప్రియుడి ఇంటికి చేరిన ప్రేమకథ

  ఇదివరకు రెండుసార్లు గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేయించాడని.. మూడోసారి గర్భం దాల్చడంతో తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపిస్తోంది సునీత. ఫోన్ చేస్తే నీకు నాకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడని వాపోయింది. ఆ క్రమంలో ప్రియుడిని వెతుక్కుంటూ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది.

  ఇద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మూడేళ్లు తనను శారీరకంగా వాడుకున్నాడని చెబుతోంది. అంతేకాదు తన ఆర్థిక అవసరాలకు తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు తాను 2 నెలల గర్భవతిగా ఉన్నానని.. పెళ్లి చేసుకొమ్మని అడగడంతో ముంబై నుండి తన ఇంటికి చేరుకుని దొరక్కుండా తిరుగుతున్నాడని వాపోయింది.

  స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

  ప్రేమ పేరుతో దగ్గరయి తనను గర్భవతిని చేసి చివరకు మొఖం చాటేశాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఆ క్రమంలో బుట్టాపూర్ గ్రామానికి చేరుకుని ప్రియుడి కోసం ఆరా తీసింది. అతని జాడ కనిపించకపోవడంతో గ్రామ పెద్దలను కలిసింది. అదే క్రమంలో స్థానిక మహిళా సంఘాల నేతలను కలిసి తన పరిస్థితిని వివరించడంతో వారు ఆమెకు బాసటగా నిలిచారు. దస్తురాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను మోసగించిన సదరు ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి మహేశ్ ఇంటికి చేరుకుని ధర్నా చేపట్టారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Nirmal District Youngster Durgam Mahesh cheated one woman Sunitha in the name of love at mumbai who belongs to bangalore. She went to mumbai for survive, in that way sunitha worked as home servant in an apartment. Mahesh worked as watchman in the same apartment, so he trapped her into love and promised to marry. He used her for sexual life, then refuse to marry. In that way sunitha came to mahesh home town from mumbai and protest for justice.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more