ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ మృతి.. మరో ఇద్దరికీ చికిత్స

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ మృతిచెందాడు. ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పారుఖ్ అహ్మద్ కాల్పులు జరిపాడు. భూ వివాదం నేపథ్యంలో ఫైర్ చేశాడు. తర్వాత తల్వార్‌తో కూడా బీభత్సం సృష్టించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ శనివారం ఉదయం చనిపోయాడు.

Recommended Video

#crime ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతి

ఫారూఖ్‌ అహ్మద్‌ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేయడంతో మొతేషీన్ నడములోకి ఒక తూటా దూసుకుపోగా, సయ్యద్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే వారిని రిమ్స్‌కు.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సయ్యద్ మృతి చెందాడు.

one dead in ex councillor firing at adilabad

కాల్పుల ఘటనలో ముగ్గురు తీవ్రంగా పడ్డారు. వీరిని వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి సయ్యద్‌ను నిమ్స్ తరలించారు. సయ్యద్ జమీర్‌ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఇవాళ ఉదయం (శనివారం) ఆయన మృతి చెందాడు. కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పాతకక్షలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

English summary
one person dead in ex councillor farooq ahmed firing at adilabad tatiguda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X