ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!

|
Google Oneindia TeluguNews

నిర్మల్‌ : రక్షణగా ఉండాల్సిన ఖాకీలు దారి తప్పుతున్నారు. చేతిలో లాఠీ ఉందనుకుంటున్నారో ఏమో గానీ రెచ్చిపోతున్నారు. అందరూ అలా అని కాదు గానీ కొందరు పోలీస్ శాఖకు మాయని మచ్చలుగా తయారవుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అసాంఘిక కార్యకలాపాల్లో మునిగితేలిన ఓ కానిస్టేబుల్ గుట్టురట్టు కావడం చర్చానీయాంశమైంది.

కొంతమంది పోలీసుల తీరు పోలీస్ వ్యవస్థకు కళంకం తెస్తోంది. ఫ్రెండ్లీ పోలీస్ అన్న పదానికి అర్థం మార్చేస్తున్నారు కొందరు. ఖాకీ చొక్కా పరువు తీస్తూ నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది.

పోలీసులే అసాంఘిక కార్యకలాపాల్లో మునిగితేలుతుంటే..!

పోలీసులే అసాంఘిక కార్యకలాపాల్లో మునిగితేలుతుంటే..!

పోలీసులంటే జనాల్లో గౌరవముంది. తప్పు చేస్తే బొక్కలో వేసి కుళ్లబొడుస్తారనే భయముంది. మరి అలాంటి పోలీసులు తప్పు చేస్తే ఇంకేమైనా ఉంటుందా. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎబనైజర్.. గుర్తు తెలియని యువతితో లాడ్జీలో కనిపించడం దుమారం రేపింది.

సదరు కానిస్టేబుల్ లాడ్జీలో యువతితో ఉన్నాడనే సమాచారంతో కొందరు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్రైమ్‌ను ఆపాల్సిన కానిస్టేబులే ఇలా అడ్డంగా బుక్కవడం స్థానికంగా చర్చానీయాంశమైంది. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన సదరు కానిస్టేబుల్ ఇలాంటి పనులకు పాల్పడటం సిగ్గుచేటనే వాదనలు వినిపిస్తున్నాయి.

నకిలీ పోలీస్.. ప్రేమికులే టార్గెట్.. లక్షలు దోచాడుగా..!నకిలీ పోలీస్.. ప్రేమికులే టార్గెట్.. లక్షలు దోచాడుగా..!

అడ్డంగా దొరికాడు.. సస్పెండ్ అయ్యాడు

అడ్డంగా దొరికాడు.. సస్పెండ్ అయ్యాడు

ఖానాపూర్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన ఎబనైజర్.. ప్రస్తుతం సీసీఎస్ అటాచ్డ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నారు. లాడ్జీలో సదరు యువతితో అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సమయంలో కొందరు వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు టీవి ఛానళ్లలో ప్రసారమైంది. దాంతో ఉన్నతాధికారుల్లో చలనం మొదలైంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కానిస్టేబుల్ ఎబనైజర్‌ను సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు.

కానిస్టేబుల్‌ను వెనుకొసుకొచ్చే ప్రయత్నం.. చివరకు తప్పని చర్యలు

కానిస్టేబుల్‌ను వెనుకొసుకొచ్చే ప్రయత్నం.. చివరకు తప్పని చర్యలు

ఎబనైజర్ తీరుపై సోషల్ మీడియా కోడై కూసినా.. టీవి ఛానళ్లు సదరు విజువల్స్ ప్రసారం చేసినా.. కొందరు పోలీస్ అధికారులు అతడిని వెనుకొసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దాంతో మరోలా వివరణ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు చేరుకున్న సదరు యువతి తన గ్రామానికి వెళ్లే క్రమంలో కానిస్టేబుల్ అండగా నిలబడినట్లు చెబుతున్నారు.

అప్పటికే రాత్రి కావడంతో బస్‌స్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆమెను కొందరు వేధిస్తున్నారనే సమాచారంతోనే కానిస్టేబుల్ చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయం కావడం.. చివరి బస్ వెళ్లిపోవడంతో ఆమెకు సాయమందించే క్రమంలో లాడ్జీలో ఉంచినట్లు తెలిపారు. అయితే కొందరు యువకులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కావడంతో తప్పని పరిస్థితుల్లో అతడిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Nirmal CCS Constable Caught Red Handed With Woman In A Lodge. Some Youngsters shoot that incident and spread over in social media. The Higher Officials Suspended the Constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X