ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేరం ఒప్పుకోని సమత నిందితులు... తప్పుడు కేసులు బనాయించారంటూ వివరణ...!

|
Google Oneindia TeluguNews

సమతా కేసులో విచారణను ఎదుర్కొంటున్న నిందితులు కొత్త ట్విస్టు ఇచ్చారు. విచారణలో భాగంగా నేడు కోర్టుకు వచ్చిన వారు తాము చేసిన నేరాన్నిఅంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని న్యాయస్థానంలో చెప్పారు. మరోవైపు డిచార్జీ పిటిషన్ నిందితుల తరపు న్యాయవాది వేశారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమతా కేసు విచారణ

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమతా కేసు విచారణ

ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామం సమీపంలో గత 24న సమతపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే... కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నారు. దీంతో నేడు నిందితులను కోర్టుకు తీసుకువచ్చారు. వారిపై చార్జీషీటు నమోదు చేసిన అంశాన్ని వివరించారు. అయితే సంఘటన జరిగిన తర్వాత నిందితులకు ఎవరు సహయం చేయకూడదని జిల్లా బార్ కౌన్సిల్ తీర్మాణం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు నిందితుల తరుఫున వాదించేందుకు లాయర్లు ఎవరు ముందుకు రాలేదు. అయితే కోర్టు జోక్యం చేసుకుని జిల్లా న్యాయసేవసమితి ద్వార అడ్వకేట్‌ను కేటాయించింది.

నేరాన్ని అంగీకరించని నిందితులు

నేరాన్ని అంగీకరించని నిందితులు

దీంతో నేడు నిందితులతో మాట్లాడేందుకు అడ్వకేట్‌కు అవకాశం ఇచ్చింది. ఈనేపథ్యంలోనే వారిమీద మోపిన నేరాలను కోర్టులో వివరించడంతో వారు ఆ నేరాలను అంగీకరించలేదు. తమపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని వారు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు నిందితుల తరుఫున డిచార్జీ పిటిషన్ కూడ వేశారు. అయితే దానిని స్వీకరించిన కోర్టు విచారించి నేరాలు చేశారా... లేదా అనేది తేల్చనుందని ప్రభుత్వ లాయర్లు చెప్పారు. డిచార్జ్ పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పారు. దీంతో కేసు విచారణకు సంబంధించి రానున్న రోజుల్లో వాదనలు కొనసాగుతాయని చెప్పారు.

40 మంది సాక్ష్యులు

40 మంది సాక్ష్యులు

కాగా సమతా హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో... పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితులపై 15 రోజుల్లోనే చార్జీషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు, 40 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు. దీంతోపాటు 96 పేజీలు నివేదికను తయారు చేశారు. కేసుకు సంబంధించిన సాంకేతికపరమైన సాక్ష్యాలను పోందుపరిచారు. నిందితులు వాడిన కత్తితోపాటు, వారు వేసుకున్న బట్టలు, బాధితురాలి వద్ద తీసుకున్న రెండు వందల రూపాయలను సైతం కోర్టుకు సమర్పించారు. మొత్తం సాక్ష్యాలు సరిపోతే.. నిందితులకు కేవలం నెల రోజుల్లోనే శిక్షలు ఖారారు అయ్యో అవకాశాలు కూడ ఉన్నాయి.

English summary
Samata case Accused have given a new twist. Those who came to court today as part of the trial did not confess their crimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X