ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమ్ముడి కోసం అన్న పాకులాట.. గిట్లనే చెప్పాలే.. గ్రామస్తులకు ఎమ్మెల్యే కోనప్ప క్లాస్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

కాగజ్ నగర్ : సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీరు వివాదస్పదమవుతోంది. తమ్ముడు తప్పు చేస్తే.. అన్న కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీ అధికారిణిపై జరిగిన దాడిలో సాక్షాత్తు ఎమ్మెల్యే.. సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారనే వీడియో బయటకు రావడం కలకలం రేపింది.

కోనేరు కోనప్ప తమ్ముడు, జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ ఆదివారం నాడు మహిళా ఎఫ్ఆర్‌వోపై దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. మహిళా అధికారిణిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేయడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో తమ్ముడికి వత్తాసు పలుకుతూ.. మీడియా ఎదుట ఏమి చెప్పాలో గ్రామస్తులకు కోనప్ప బ్రీఫింగ్ ఇస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో మరో వివాదం చుట్టుముట్టింది.

తమ్ముడిని రక్షించే ప్రయత్నం.. మీడియాకు ఇలా చెప్పండంటూ..!

తమ్ముడిని రక్షించే ప్రయత్నం.. మీడియాకు ఇలా చెప్పండంటూ..!

కాగజ్ నగర్‌ ఏరియాలో ఆదివారం నాడు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు కృష్ణపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. అటు సీఎం కేసీఆర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు 16 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదలావుంటే తమ్ముడిని రక్షించే ప్రయత్నంలో ఎమ్మెల్యే కోనప్ప సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపింది.

అటవీశాఖ సిబ్బందిపై జరిగిన దాడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు కోనప్ప. ఆ మేరకు గ్రామస్తులకు ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో పూసగుచ్చినట్లు వివరిస్తున్న వీడియో ఒకటి బయటకు రావడం సంచలనం సృష్టించింది. అధికారులదే తప్పంతా అనే విధంగా మీడియా సమావేశంలో చెప్పాలని ఎమ్మెల్యే చెబుతుండటం మరో వివాదానికి కారణమైంది.

బతుకుతానని అనుకోలేదు, మహిళ FRO కన్నీళ్లు.. డీఎస్పీ, సీఐ ఔట్.. ప్రభుత్వంపై విపక్షాల దాడిబతుకుతానని అనుకోలేదు, మహిళ FRO కన్నీళ్లు.. డీఎస్పీ, సీఐ ఔట్.. ప్రభుత్వంపై విపక్షాల దాడి

విలేకరులు వస్తారు.. ఇలా చెప్పండి.. కోనప్ప బ్రీఫింగ్


ఆదివారం నాడు జరిగిన దాడి నుంచి తమ్ముడ్ని ఎలా తప్పించాలో స్కెచ్ వేశారు కోనప్ప. ఆ మేరకు గ్రామస్తులను పిలిపించి బ్రీఫింగ్ ఇచ్చారు. విలేకరులను పిలిపిస్తున్నా, వాళ్లు వచ్చాక నేను ఏం చెబుతానో అదే చెప్పండి. అధికారులదే తప్పంతా అని మీరు చెబితేనే బాగుంటుంది. భూముల దగ్గరకు వెళ్లొద్దని వాళ్లు బెదిరిస్తున్నారు.

భూముల్లో తవ్వకాలు జరుపుతూ మా భూముల్లోకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. 15 రోజుల కింద వచ్చి మమ్మల్ని కొట్టారు. ఇప్పుడు కూడా మళ్లీ కొట్టారు. వాళ్లు కొట్టిన తర్వాతే దున్నొద్దని ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లాము. అప్పుడే గొడవ ముదిరింది. ఇలా చెప్పాలంటూ గ్రామస్తులకు నూరిపోశారు కోనప్ప. అయితే సదరు వీడియో బయటకు రావడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదస్పదమైంది.

 సార్సాలలో టెన్షన్ టెన్షన్.. ఐజీ నాగిరెడ్డి మకాం అక్కడే..!

సార్సాలలో టెన్షన్ టెన్షన్.. ఐజీ నాగిరెడ్డి మకాం అక్కడే..!

కోనప్ప గ్రామస్తులకు బ్రీఫింగ్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగింది. ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి. ఆ వీడియోను తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. మరోవైపు దాడి కేసులో కోనేరు కృష్ణతో పాటు మరో 15 మందిని సిర్పూర్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

నిందితులను ఆదిలాబాద్ జైలుకు తరలించారు పోలీసులు. అదలా ఉంటే మెరుగైన చికిత్స కోసం అనితను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు సార్సాల ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఫారెస్ట్ అధికారులు భూమిని చదును చేసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా మొక్కలు నాటి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. అదలావుంటే రైతులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నట్లు సమాచారం. ఐజీ నాగిరెడ్డి అక్కడే మకాం వేసి పరిస్థితి సమీక్షిస్తున్నారు.

English summary
Sirpur MLA Koneru Konappa brother and Zilla Parishad Vice Chairman Koneru Krishna attacked the women's FRO on Sunday. There are allegations of indiscriminate assault on a female officer with sticks. Another controversy has surrounded the video of Konappa giving a briefing to the villagers about what to say in front of the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X