ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాతో ఆదిలాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ రాజన్న కన్నుమూత - టీఆర్ఎస్ నేతల సంతాపం

|
Google Oneindia TeluguNews

దేశంలోనే మెరుగైన రికవరీ రేటు ఉన్నప్పటికీ, తెలంగాణలో కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు, రాజకీయ నేతలు, హక్కుల ఉద్యమకారులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజాగా టీఆర్ఎస్ ప్రముఖ నేత, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న వైరస్ బారినపడి కన్నుమూశారు.

ఏపీకి మరో బంపర్ ప్రాజెక్టు - కడపలో ఆపిల్ తయారీ యూనిట్ - మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడిఏపీకి మరో బంపర్ ప్రాజెక్టు - కడపలో ఆపిల్ తయారీ యూనిట్ - మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి

చాలా రోజుల కిందట కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో రాజన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి షిఫ్ట్ అయ్యారు. అయినాసరే, ఆరోగ్య మెరుగుపడకపోగా, రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. పరిస్థితి బాగా విషమించడంతో సోమవారం ఉదయం రాజన్న తుదిశ్వాస విడిచారు.

TRS leader, Adilabad ZP vice chairman rajanna dies of coronavirus

Recommended Video

Telangana First Apple || కాశ్మీర్, సిమ్లా యాపిల్ తరహాలో ఇక తెలంగాణా ఆపిల్....!!

జెడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న మృతి పట్ల ఆదిలాబాద్ జిల్లాఅల్లోల మంత్రి ఇద్రకరణ్ రెడ్డి సహా పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజన్న కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం 1802 కొత్త కేసులు నమోదుకాగా, అందులో 16 కేసులు ఆదిలాబాద్ లో వెలుగుచూశాయి. జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి పైచిలుకు కేసులు నమోదయ్యాయి.

English summary
TRS leader and Adilabad Zilla Parishad vice chairman Rajanna succumbed to the coronavirus on Monday morning. Rajanna had been admitted to a private hospital in Adilabad three days ago after testing positive for the virus. Later, he was shifted to another hospital in Hyderabad after his health deteriorated. Rajanna's health condition turned critical during the treatment and died today morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X