ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రోల్ తీసుకొని తహసీల్దార్ కార్యాలయానికి: దంపతుల హల్ చల్ : ఆళ్లగడ్డలో కలకలం..!

|
Google Oneindia TeluguNews

తహశీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్య ఘటన మరవక ముందే అదే తరహాలో జరిగిన ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ తాను ఎన్ని సార్లు తిరిగినా తన సమస్య పరిష్కరించటం లేదంటూ తహసీల్దార్‌‌పై సురేష్ అనే రైతు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆపై తను కూడా పెట్రోల్‌ పోసుకుని సురేష్‌ నిప్పంటించుకున్నాడు. దీంతో..ఇద్దరూ మరణించారు. ఇక, ఇప్పుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దంపతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అదే తరహాలో ప్రయత్నం చేసారు. అయితే అధికారి పైన కాకుండా.. వారికి వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకొని వారించారు. దీంతో..విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని సుబ్బారెడ్డి దంపతులకు హామీ ఇచ్చారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్య కోసం..
స్థలం విషయంలో తమకు అన్యాయం చేశారంటూ ఆళ్లగడ్డ తాహశీల్దార్ ఆఫీస్ వద్ద దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. బత్తులూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు పెట్రోల్, పురుగుల మందు డబ్బా తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పది సంవత్సరాల పాటు తాశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరుగలేదంటూ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. స్థానికులు వారిని అడ్డుకుని వారించారు. సుబ్బారెడ్డికి జాతీయ రహదారి పక్కనే వేరువేరు సర్వే నెంబర్లతో 11 సెంట్ల స్థలం ఉంది. ఈ రెండు స్థాలల్లో ఒకటి హైవే విస్తరణలో పోయింది. స్థలానికి ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించింది. ఇంకో సర్వే నెంబర్‌తో ఉన్న స్థలాన్ని మరో వ్యక్తి పన్ను చెల్లించి రెవెన్యూ రికార్డుల్లో తన పేరుతో నమోదు చేయించుకున్నారు.

A couple prepare for suicide in Allagadda Tahsildar office

న్యాయం చేయాలని కోరుతూ..
స్థలం విషయంలో తమకు న్యాయం చేయాలని దంపతులిద్దరూ తాహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తాహశీల్దార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురయిన సుబ్బారెడ్డి దంపతులు పురుగుల మందు, పెట్రోల్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందు తాహశీల్దార్ ఆఫీస్‌కు వచ్చా;రు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని సుబ్బారెడ్డి దంపతులకు హామీ ఇచ్చారు. దీంతో..అక్కడ అందరూ అబ్దుల్లా పూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఘటన గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన తరువాత కొందరు అధికారులు తమ కార్యాలయాల్లో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, సమస్యలు పరిష్కారం కాకుంటే ఇప్పుడు ఈ దంపతులు సైతం పెట్రోల్ తో కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించటంతో జిల్లా అధికారుల్లో కలకలం మొదలైంది. దీంతో..వారి సమస్య పెండింగ్ కు గల కారణాల పైన ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
A couple tried for suicied in Tahasildar office in Allagadda. They came with petrol cans protesting Officers not taking care of thier problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X