ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలిగిన అఖిల...గ‌న్‌మెన్లె వెన‌క్కు.. నా అనుచ‌రుల పైనే...!

|
Google Oneindia TeluguNews

మంత్రి అఖిల‌ప్రియ అలిగారు. ర‌క్ష‌ణ గా ఉండే గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కు పంపారు. పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా నిర్ణ‌యం తీసుకున్న అఖిల ప్రియ నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేర‌కు తాము న‌డుచుకుంటున్నామ‌ని స్థానిక పోలీసు అధికారులు చెప్పినా..మంత్రి అఖిల అల‌క వీడ‌లేదు. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఉన్న‌త స్థాయ అధికారుల వ‌ద్ద‌కు చేరింది..

కసి వస్తే మీరు తట్టుకోలేరు! నేను మాట్లాడకుంటే వాళ్లు ఫీల్ అవుతున్నారు: అఖిలప్రియ కసి వస్తే మీరు తట్టుకోలేరు! నేను మాట్లాడకుంటే వాళ్లు ఫీల్ అవుతున్నారు: అఖిలప్రియ

అఖిల ప్రియ

అఖిల ప్రియ

మంత్రి అఖిల ప్రియ పోలీసుల పై అల‌క‌బూనారు. ఆళ్ల‌గడ్డ లోని త‌న అనుచ‌రుల ఇళ్ల‌ల్లో పోలీసులు త‌నిఖీలు నిర్వ హించ‌టాన్ని అఖిల సీరియ‌స్ గా తీసుకున్నారు. దీంతో..వారి సై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అఖిల త‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఉండే గ‌న్‌మెన్ల‌ను సైతం వెన‌క్కు పంపించారు. అఖిల త‌న నిర‌స‌న‌లో భాగంగా..స్థానికంగా ర‌క్ష‌ణ కోసం వ‌స్తున్న స్థానిక పోలీ సుల‌ను సైతం రావ‌ద్ద‌ని ఆదేశించారు.

అఖిల ప్రియ అనుచ‌రుల ఇళ్ల‌ల్లో సోదాలు

అఖిల ప్రియ అనుచ‌రుల ఇళ్ల‌ల్లో సోదాలు

పోలీసు ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు స్థానిక పోలీసులు..ఆళ్ల‌గ‌డ్డ‌లోని ప‌లు రాజ‌కీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేత‌ల ఇళ్ల‌ల్లో ఆక‌స్మిక సోదాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా..మంత్రి అఖిల ప్రియ అనుచ‌రుల ఇళ్ల‌ల్లోనూ సోదాలు జ‌రిపారు. దీంతో..వారు ఈ విష‌యాన్ని మంత్రి అఖిల దృష్టికి తీసుకొ చ్చారు. దీంతో..త‌న అనుచ‌రుల ఇళ్ల‌ల్లోనే సోదాలు చేస్తారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ..గ‌న్‌మెన్ల‌ను పిలిచి వెళ్లిపోవాల ని ఆదేశించారు. దీంతో..వారు పోలీసు ఉన్న‌తాధికారులకు ప‌రిస్థితి నివేదించారు.

ఉన్న‌తాధికారుల జోక్యం..అయినా...

ఉన్న‌తాధికారుల జోక్యం..అయినా...

త‌న అనుచ‌రుల ఇళ్ల‌ల్లో సోదాలు చేయ‌టం పై మంత్రి ఆగ్ర‌హం తెలుసుకున్న స్థానిక పోలీసు అధికారులు ఉన్న‌తాధి కారుల ఆదేశాల మేర‌కే సోదాలు కొన‌సాగించామ‌ని వివ‌రించారు. కేవ‌లం అఖిల అనుచ‌రుల ఇళ్ల‌ల్లోనే కాద‌ని..అన్ని పార్టీల నేతల ఇళ్ల‌ల్లోనూ సోదాలు సాగాయ‌ని న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అయినా..మంత్రి శాంతించ‌లేదు. ఇక‌, జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం లో భాగంగా వెళ్లిన మంత్రికి ర‌క్ష‌ణగా స్థానిక పోలీస‌లు అక్క‌డికి చేరుకున్నారు. దీంతో, మ‌రో సారి మంత్రి అఖిల వారి పై మండిప‌డ్డారు. మంత్రి త‌మ వివ‌ర‌ణ‌కు శాంతించ‌క‌పోవ‌టంతో..స్థానిక పోలీసు అధికారులు ఉన్న‌తాధికారుల దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు. రాజ‌కీయంగా కూడా ఈ విష‌యం కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీని పై అఖిల ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

English summary
Minister Akhila Priya rejected her Gun mens in part of protest against local police officers. Kurnool district police officers conducted searches in second cadre political leaders houses. But, Akhila seriously objected on police searches in her supporters houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X