ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కసి వస్తే మీరు తట్టుకోలేరు! నేను మాట్లాడకుంటే వాళ్లు ఫీల్ అవుతున్నారు: అఖిలప్రియ

|
Google Oneindia TeluguNews

ఆళ్లగడ్డ: తనకు ఓ మీడియా ప్రతినిథి ఫోన్ చేసి, మేడమ్.. మీ పార్టీ నేత వైసీపీలోకి వెళ్తున్నారట, ఎలా ఫీలవుతున్నారని అడిగారని, దానికి తాను వాళ్లు ఇంకా పార్టీలోనే ఉన్నారా అని నేను ఎదురు ప్రశ్నించానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అసలు వాళ్లు పార్టీలో ఉన్నారనే సంగతి కూడా మరిచిపోయానని నవ్వుతూ చెప్పారు.

సదరు రిపోర్టర్‌కు తాను ఓ సలహా కూడా ఇచ్చానని, మీరు తనకు ఫోన్ చేసి ఎలా ఫీల్ అవుతున్నారని అడగడం కాదని, ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి అడగాలని చెప్పానని అన్నారు. ఆమె మాట్లాడుతుండగా భూమా అభిమానులు, కార్యకర్తలు ఈలలు వేశారు, కేరింతలు కొట్టారు. ఆళ్లగడ్డలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

అందరూ నాటకాలు ఆడుతున్నారు

అందరూ నాటకాలు ఆడుతున్నారు

ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారని అఖిలప్రియ అన్నారు. పదవుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారని చెప్పారు. ఏకమవుతున్న తన ప్రత్యర్థులకు, వారి కేడర్‌కు ఒక్కటే చెబుతున్నానని, ఇన్నాళ్లు ఆయన కోసం మీరు (కేడర్) ఇబ్బంది పడ్డారని, మీపై కేసులు వచ్చాయని, మీరు నష్టపోయారని, కానీ ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టి తన లబ్ధి కోసం వైసీపీలోకి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యర్థి కేడర్‌కు నేను ఒక్కటే చెబుతున్నానని, మీరు పని చేయాలనుకుంటే, మీకు గౌరవం కావాలనుకుంటే మా వద్దకు రావాలని, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు.

ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం: టీడీపీ ఎదురుదాడి, మధ్యలో రామ్ గోపాల్ వర్మఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం: టీడీపీ ఎదురుదాడి, మధ్యలో రామ్ గోపాల్ వర్మ

మా వాళ్లది పెద్ద మనసు

మా వాళ్లది పెద్ద మనసు

మా వాళ్లందరిదీ (భూమా కేడర్) పెద్ద మనసు అని, ఎవరు వచ్చినా వాళ్లను స్వీకరించే మంచి మనసు ఉందని అఖిలప్రియ చెప్పారు. ఇక్కడ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని చెప్పారు. అవతలి వాళ్లకు కూడా చెబుతున్నానని, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా వద్దకు వస్తే, నేను మిమ్మల్ని కూడా చూసుకుంటానని చెప్పారు.

కసి వస్తే మీరు తట్టుకోలేరు

కసి వస్తే మీరు తట్టుకోలేరు


చాలామంది తన వద్దకు వచ్చి మన వాళ్లకు ఇంకా కసి రావట్లేదు, కసి రావట్లేదని చెబుతున్నారని, కానీ ఆ కసి సమయం వచ్చినప్పుడు వస్తుందని, మా వాళ్లకు అది వస్తే మీరు తట్టుకోలేరని చెప్పానని అఖిలప్రియ అన్నారు. అప్పుడు సునామీ వస్తుందన్నారు. మనం ఏ కార్యక్రమాలు చేశామో, ఎంత చేశామో, ఇంకా ఎంత చేయాలో అనే దానిపై మనం తరిచి చూసుకోవాలన్నారు. దీంతో పాటు మన ప్రత్యర్థుల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉందంటూ, వారి గురించి కూడా మాట్లాడారు.

మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పా

మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పా

చాలామంది టెన్షన్ పడుతున్నారని కానీ అలా వద్దని అఖిలప్రియ తన కేడర్‍‌కు సూచించారు. ఇక్కడ చాలామంది నా గెలుపుపై మాట్లాడలేదని, మెజార్టీ గురించి మాత్రమే మాట్లాడారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోను నేను ఓ సవాల్ చేశానని, భూమా బ్రహ్మానంద రెడ్డి గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, భూమా వర్గం నాయకురాలిగా ఉన్న తాను నియోజకవర్గంలో మరొకరితో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదన్నారు.

చావనైనా చస్తా కానీ, అలా రాజకీయం చేస్తా

చావనైనా చస్తా కానీ, అలా రాజకీయం చేస్తా


నేను చావనైనా చస్తాను కాని ఒకరి వద్ద తలదించనని అఖిలప్రియ చెప్పారు. మిమ్మల్ని (తన కేడర్) కూడా తలదించకుండా చూసుకుంటానని చెప్పారు. ఇన్ని రోజులు వర్గం కోసమో, గ్రూప్ కోసమో మీరు త్యాగాలు చేశారని, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా నేను చూశానని చెప్పారు. నా తల్లిదండ్రులు కూడా మీ కోసం ఎంతో తపించడం చూశానని, అవన్నీ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని తలదించుకోనియకుండా రాజకీయం చేస్తానని చెప్పారు. మన రాజకీయ ప్రత్యర్థుల గురించి నేను మాట్లాడకుంటే వారు ఫీల్ అవుతున్నారని, నా నోట్లో నుంచి వాళ్ల గురించి మాటలు రావడం లేదని బాధపడుతున్నారని, అందుకే వారి గురించి కూడా మాట్లాడుతున్నానని అఖిలప్రియ చెప్పారు.

English summary
Andhra Pradesh minister and TDP Allagadda MLA Bhuma Akhila Priya suggestion to reporter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X