అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంపర్ ఆఫర్, ఆ రోజు 10 శాతం డిస్కౌంట్.. వారికి మొబైల్స్ కాస్త చౌకే..త్వరపడండి..

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికే ఇచ్చింది. ఆ రోజు ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మొబైల్‌ ఫోను కొనుగోలు చేసే మహిళలకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు సిద్ధం చేయాలని స్పష్టంచేశారు.

ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు..

ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు..


దిశ చట్టం కింద తీసుకుంటున్న చర్యలు, దీనిపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడు, మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జగన్ సమీక్షించారు. మహిళ భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిలిం పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి విభాగం నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సత్కరించాలని తెలిపారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళలు అందరికీ ఆ రోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించారు.

ఏడాదికోసారి హెల్త్ చెకప్

ఏడాదికోసారి హెల్త్ చెకప్


అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ప్రతీ సంవత్సరం హెల్త్‌ చెకప్‌, మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవులు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీ చేపట్టాలన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంచేందుకు సెర్ప్‌, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఎంఓయూ చేసుకోవాలన్నారు.

44 వేల అంగన్‌వాడీ భవనాలు

44 వేల అంగన్‌వాడీ భవనాలు


'నాడు-నేడు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 44,119 అంగన్‌వాడీ భవనాల అభివృద్ధి, కొత్తవాటి నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏకకాలంలో పనులు ప్రారంభం కావాలన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు ఇంగ్లీషు, తెలుగు డిక్షనరీలు ఇవ్వాలని సూచించారు. పిల్లలు రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలన్నారు. ఇదే తరహాలో అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు.

సీఎం జగన్ పరిశీలన

సీఎం జగన్ పరిశీలన


అంగన్‌వాడీల్లో ప్రీప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను మహిళా శిశు సంక్షేమాధికారులు ప్రదర్శించగా సీఎం జగన్ పరిశీలించారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతలపై నిర్దేశించిన విధి విధానాలతో ఎస్‌ఓపీ బుక్‌ను అందిస్తున్నామని వివరించారు.

English summary
10 percent discount on mobiles purchased on march 8th andhra pradesh government sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X