అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 పోస్టులు : 3 నోటిఫికేష‌న్లు: విడుద‌ల చేసిన ఏపిపిఎస్సీ..

|
Google Oneindia TeluguNews

ఏపి లో వివిధ విభాగాల్లో ఖాళీల భ‌ర్తీ పై ఏపిపిఎస్సీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొత్తం 13 పోస్టుల‌కు సబం దించి మూడు నోటిఫికేష‌న్ల‌ను విడుదల చేసింది. జ‌వ‌న‌రి 19 వ‌రకు ద‌ర‌ఖాస్తుకు స‌మ‌యం ఇచ్చింది. వీటికి మెయిన్స్ ప‌రీక్ష‌ను ఏప్రిల్ 25న నిర్వ‌హించ‌నున్నారు.

నిరుద్యోగుల‌కు తీపి క‌బురు : 1051 పంచాయితీ కార్య‌ద‌ర్శుల పోస్టుల కు నోటీఫికేషన్.. నిరుద్యోగుల‌కు తీపి క‌బురు : 1051 పంచాయితీ కార్య‌ద‌ర్శుల పోస్టుల కు నోటీఫికేషన్..

ఏపిలో ప‌లు ప్ర‌భుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ఒక దాని త‌రువాత మ‌రొక‌టి పై ఏపిపిఎస్సీ క‌స‌ర‌త్తు ప్రారం భించింది. దీనిలో భాగంగా.. 13 పోస్టుల నియామకాల కోసం ఏపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దేవదాయ శాఖలోని 7సహాయ కమిషనర్‌ పోస్టులు..విద్యుత్‌శాఖలోని 3 సహాయ విద్యుత్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. బాయిలర్స్‌ విభాగం లోని 3ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్‌ పోస్టుల భర్తీకి ఈ ప్రకటనలు విడుదలయ్యాయి.

13 posts..3 notifications : APPSC new calendar..

దరఖాస్తుల సంఖ్య 25వేలకు మించితే స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. మెయిన్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ పోస్టులకు 'లా' గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థులు ఈనెల 28నుంచి జనవరి 19వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజును జనవరి 18 రాత్రి 11.59 లోపు చెల్లించాలి. మెయిన్స్‌ 2019 ఏప్రిల్‌ 3-4 తేదీల్లో నిర్వహిస్తారు. సహాయ విద్యుత్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. జనవరి 3నుంచి 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక‌, ఈ పోస్టుల‌కు సంబంధించి పరీక్ష ఫీజును జనవరి 24రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుంద‌ని అధికారులు ప్ర‌క టించారు. మెయిన్స్ ప‌రీక్ష ను ఏప్రిల్‌ 17న నిర్వహిస్తారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పోస్టులకు మెకానికల్‌..ప్రొడక్షన్‌..

మెటలర్జికల్‌ గ్రాడ్యుయేట్లు అర్హు లు. 2019 జనవరి4 నుంచి 25వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజును జనవరి 24 రాత్రి 11.59లోపు చెల్లించాలి. మెయిన్స్‌ ఏప్రిల్‌ 25న నిర్వహిస్తారు. ఎన్నిక‌ల ఏడాది కావ‌టం..మ‌రో రెండు నెల‌ల్లో నోటిఫి కేష‌న్ విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో..ఈ లోగానే సాధ్య‌మైన‌న్ని పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని ఏపిపిఎస్సీ భావిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుండి ఈ మేర‌కు అనుమ‌తి ల‌భించింది.

English summary
APPSC released three notifiations for fill up of 13 posts. In Endowments, power sector, boilers departement different vacancies are there. APPSC planning to give some more notifications shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X