అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2019 రౌండప్... త్రిశంకు స్వర్గంలో ఏపీ రాజధాని .. ఇంతకీ రాజధాని ఏది ? బిగ్ డిబేట్

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని వ్యవహారం త్రిశంకు స్వర్గంలా మారింది. ఇంతకీ ఏపీ రాజధాని ఏది అంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏకంగా మంత్రివర్యులు ఏపీకి రాజధాని ఏది అంటే సమాధానం దాటవేసి వెళ్లారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీకి రాజధాని ఏంటి అంటే సమాధానం చెప్పడం లక్ష డాలర్ల ప్రశ్నలా మారిపోయింది. 2019 సంవత్సరం ఏపీ రాజధానిని త్రిశంకు స్వర్గంలో పడేసింది.

ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?

గత అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల ప్రకటన చేసిన జగన్

గత అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల ప్రకటన చేసిన జగన్

గత అసెంబ్లీ సమావేశాల్లో, సమావేశాల చివరి రోజున రాజధాని వ్యవహారంపై సీఎం జగన్ మాట్లాడుతూ మూడు రాజధానులు ఏపీకి ఉండాల్సిన అవసరం ఉంది అని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ ,అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, జి ఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇక ఆ తర్వాత జి ఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత 27వ తేదీన మంత్రివర్గ భేటీ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తానని చెప్పడం జరిగింది.

ఏది రాజధాని అన్నది అర్ధంకాని గందరగోళం

ఏది రాజధాని అన్నది అర్ధంకాని గందరగోళం

ఇక రాజధాని అమరావతి రైతులు నాటి నుండి నేటి వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. 27వ తేదీన నిర్ణయం వెల్లడిస్తామని చెప్పిన ఏపీ సర్కార్ రాజధాని విషయంలో మరోమారు హైపవర్ కమిటీని వేసింది. ఈ సారి అభివృద్ధి వికేంద్రీకరణ పై అధ్యయనం చేయాలని ఆ నివేదిక తర్వాతే వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే అప్పటి వరకూ ఏపీ రాజధాని అమరావతి అనుకోవాలా లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో వైజాగ్ రాజధానిగా భావించాలా అన్నది ఇప్పటికీ అంతు చిక్కకుండా ఉంది.

వైజాగ్ అని కొందరు, అమరావతి అని మరికొందరు

వైజాగ్ అని కొందరు, అమరావతి అని మరికొందరు


హైపవర్ కమిటీని వేసిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, సాక్షాత్తు స్పీకర్ తో సహా ప్రతి ఒక్కరూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఖచ్చితంగా రాజధాని విశాఖ నే అని ప్రకటిస్తున్నారు. ఇక మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి, వామపక్ష పార్టీలు రాజధాని అమరావతిని తరలించడం మంచి నిర్ణయం కాదని, రాజధాని అమరావతి అని తేల్చి చెబుతున్నారు. వైజాగ్ రాజధాని అని కొందరు, అమరావతి రాజధాని అని మరికొందరు ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక దీంతో ఇంతకీ రాజధాని ఏది అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. కచ్చితంగా ఏపీ రాజధాని ఇదీ అని చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది.

 మూడు ప్రాంతాల వారి కొట్లాట .. రాజధాని కోసం రగడ

మూడు ప్రాంతాల వారి కొట్లాట .. రాజధాని కోసం రగడ

ఇక ఇదే సమయంలో రాయలసీమ వాసులు నుండి కొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది. రాయలసీమలో హైకోర్టు మాత్రమే ఏర్పాటు చేస్తే సరిపోదని, రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, గతంలో కర్నూలు రాజధానిగా ఉన్న అంశాన్ని గుర్తుంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి తరలిస్తే ఊరుకోబోమని రాజధాని రైతులు చెప్తుంటే, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వైజాగ్ అన్నిటికి అనుకూలంగా ఉంటుందని, రాజధాని అక్కడ అయితేనే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

 త్రిశంకు స్వర్గంలో ఏపీ రాజధాని

త్రిశంకు స్వర్గంలో ఏపీ రాజధాని

ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతి పేరు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఏపీ రాజధాని వెలగపూడి పేరుతోనే పరిగణనలో ఉంది. ఇక ఇలాంటి సమయంలో ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నకు సమాధానం ఎవరు రాసినా అది తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత ఏపీ రాజధాని త్రిశంకు స్వర్గంలో ఉంది. ఎటూ కాకుండా వేలాడుతుంది. ఎప్పటికీ క్లారిటీ వస్తుందో అర్థంకాని పరిస్థితిలో ఉంది. 2019 మొత్తం ఏపీ రాజధాని పై నీలినీడలు అలుముకుని , ఆందోళన దాకా వెళ్ళింది. 2020 లో నైనా ఓ క్లారిటీ వస్తుందో లేదో వేచి చూడాలి.

English summary
AP Capital's affair has become a haven of Trishanku. The capital of the AP is unanswerable. It is understood that the ministers have left the capital of the AP, which is the answer. What is the capital of AP right now?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X