ఐదుగురి గేమ్.. ఖాళీగా ఉంటున్నానని వెళ్లాడు..ఆర్జీవీ-నాని మీట్‌పై నట్టి
సినిమా టికెట్ల ధరలు కాక రేపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తగ్గిస్తామని.. పెద్ద హీరోల సినిమాలకు పెంచాలని అంటోన్న సంగతి తెలిసిందే. ఇవాళ ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. తర్వాత ఇద్దరూ పాత పాటే పాడారు. అయితే వీరి భేటీ గురించి నిర్మాత నట్టి కుమార్ కూడా స్పందించారు.
గల కొన్ని రోజులుగా ఏపీ సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలు తెలిసిందే. సినిమా టికెట్ రేట్ల ధరలు బాగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమ వ్యక్తులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంట్రవర్సీ డైరక్టర్ ఆర్జీవీ సైతం గొంతు విప్పారు. అతని వాదన వినేందుకు నేరుగా మంత్రి పేర్ని నాని భేటీ జరిగింది. వర్మ ఫిల్మ్ మేకర్ గానే మంత్రిని కలుస్తున్నానని సినీ పరిశ్రమకు ప్రతినిధిగా కాదని చెప్తున్నారు.

మంత్రిని వర్మ కలవడంపై ప్రొడ్యూసర్ నట్టికుమార్ విమర్శలు గుప్పిస్తున్నారు. 'అమ్ముడుపోయిన ఆర్జీవీ.. ఇండస్ట్రీ తరఫున చర్చలకు వెళ్లలేదు. ఆర్జీవీ ఇండస్ట్రీతో సంబంధం లేదని చెప్పుకుంటూ చర్చలకు వెళ్లడమేంటి? ఇవన్నీ టైంపాస్ కోసం మాత్రమే. ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దాని నివేదిక వచ్చేదాకా ఏమీ చేయలేరు' 'ఇదంతా ఓ ఐదుగురు కలిసి ఆడుతున్న గేమ్. టికెట్ రేట్లు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించి జనాన్ని దోచుకునే ప్లాన్. ఈ చర్చలతో ప్రజలకు, చిన్న సినిమాలకు ఎలాంటి ఉపయోగం లేదు.
సినిమాటోగ్రఫీ చట్టాన్ని రద్దు చేయడం పేర్ని నాని చేతుల్లో ఉందా? సీఎం జగన్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటారని కామెంట్ చేశారు. వర్మను, వర్మ సినిమాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వర్మకు సినిమాలు లేక ఖాళీగా ఉండి కార్పొరేట్ కంపెనీల కోసమే వెళ్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. మరీ ఈ కామెంట్లపై వర్మ ఏ విధంగా మాట్లాడతారో చూడాలీ మరీ.