అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

90 లక్షల మందికి మేలు: మహిళలకు పండగరోజు, ఆసరాపై వైసీపీ ఎమ్మెల్యే రోజా

|
Google Oneindia TeluguNews

డ్వాక్రా మహిళలకు ఇవాళ పండగ రోజు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ఆర్ ఆసరా హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు. మహిళల కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు. ఆసరా ద్వారా 90 లక్షల మందికి మేలు జరుగుతోందని చెప్పారు. జగన్ మహిళ పక్షపాతి అని చెప్పారు.

చంద్రబాబు మాదిరిగా కుంటి సాకులు చెప్పడం జగన్‌కు తెలియదని చెప్పారు. మహిళలకు అండగా ఉంటున్న సీఎం జగన్‌కు నారీ లోకం అంతా రుణపడి ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలను రోజా వివరించారు. మహిళలకు అందజేసే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.

90 lakhs woman to benefit asara, mla roja

దళిత మహిళ హోం మంత్రి, ఎస్టీ మహిళ డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళకు అవకాశం కల్పించారని చెప్పారు. మహిళల ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశలవారీగా సీఎం జగన్ ఎత్తివేస్తున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు ప్రవేయం ఉందని చెప్పారు. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగుల బెట్టించిన ఘనత చంద్రబాబుది అని చెప్పారు. ఇదివరకు సీబీఐ రాష్టానికి రావద్దని జీవో ఇచ్చింది చంద్రబాబు కాదా అని అడిగారు. కానీ ఇవాళ సీబీఐ విచారణ కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.

English summary
90 lakhs woman to benefit asara scheme ysrcp mla rk roja said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X