అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో మోడీ స‌న్నిహితుడి భారీ పెట్టుబ‌డులు : వ‌్యాపారమా - రాజ‌కీయమా : ఏం జ‌రుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజ‌కీయ సంబంధాలు..వ్యాపార సంబంధాలు గా మారిపోతున్నాయి. ఏపిలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త స‌మీక‌ర‌ణాల‌కు కారణంగా నిలుస్తున్నాయి. కేంద్రం పై పోరు అంటున్నారు. మోదీ ఏపి పై క‌క్ష్య పెంచుకుంటున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి..మోదీ స‌న్నిహితుడు ఏపిలో అంత పెద్ద మొత్తంలొ పెట్టుబ‌డుల కు ఎలా ముందుకొస్తున్నారు. రాజ‌కీయంగా జ‌రుగుతుందేటి..ఈ పెట్ట‌బ‌డుల ప్రోద్భ‌లం ఎవ‌ర‌ది..మేలు ఎవ‌రికి..

ప్ర‌భుత్వం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ : న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలోనే మంత్రి గ‌ళం : ఇంకా అదే గ్యాప్‌..! ప్ర‌భుత్వం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ : న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలోనే మంత్రి గ‌ళం : ఇంకా అదే గ్యాప్‌..!

రాజ‌కీయ‌మా..ఆర్డిక సంబంధ‌మా..!

రాజ‌కీయ‌మా..ఆర్డిక సంబంధ‌మా..!

ఏపిలో డేటా పార్క్..పోలార్ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు ఆదానీ గ్రూపు నిర్ణ‌యం తీసు కుంది. అందులో భాగంగా..ఏపి ఐటి శాఖ - ఆదానీ గ్రూపు మ‌ధ్య ఒప్పందం కుదిరింది. సీయం చంద్ర‌బాబు- మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో ఈ ఒప్పందం జ‌రిగింది. విశాఖ న‌గరంలో ప‌ర్య‌వార‌ణ హిత డేటా పార్క్ ను ఆదానీ గ్రూపు ఏర్పాటు చేస్తోంది.

మోదీ- చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయంగా పోరు

మోదీ- చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయంగా పోరు

రాబోయే 20 ఏళ్లలో ల‌క్ష ఉద్యోగాల క‌ల్ప‌న‌కు వీలుగా రూ. 70 వేల కోట్ల పెట్టుబ‌డుల‌కు సంసిద్ద‌త వ్య‌క్తం చేస్తు న్నారు. అయితే, పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆదానీ ప్ర‌ధాని మోదీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరు ఉంది. ప్ర‌ధాని మోదీ- ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయంగా కొంత కాలంగా తీవ్ర స్థాయిలో పోరు న‌డు స్తోంది. ఈ సంద‌ర్భంలోనే ఆదాని నేరుగా ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చి పెట్ట‌బ‌డుల‌కు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే విష‌యం ఏపికి పెట్టుబ‌డులు వ‌చ్చ‌యానే భావ‌న ఉన్నా..రాజ‌కీయంగా ఏదో జ‌రుగుతుంద‌నే అనుమానా లు క‌నిపిస్తున్నాయి.

పెట్టుబ‌డుల వెనుక‌...!

పెట్టుబ‌డుల వెనుక‌...!

ఏపికి ఆదానీ మాత్ర‌మే కాదు..ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్టిన ఆహ్వానించాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయం లేదు. ఆదానీ ప్ర‌ధానికి సన్నిహ‌తుడైనా..వ్యాపార‌వేత్తే. ఎక్క‌డ వారి వ్యాపారానికి అనుకూలంగా ఉంటే అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తారు. అయితే, ప్ర‌ధాని మోదీ కి స‌న్నిహిత వ్య‌క్తిగా ఉన్న ఆదానీ ఏపి లో పెట్టుబ‌డులు పెట్టేందు ముందుకు రావ‌టం వెనుక వ్యాపార ప్ర‌యోజ‌నమా లేక ఎవ‌రి ప్రోద్బ‌లం ఏమైనా ఉందా అనే చ‌ర్చ మొద‌లైంది. మోదీకి నిజంగా ఏపి మీద అంత వ్య‌తిరేక‌త ఉంటే..

ఆయ‌న అభిప్రాయాల‌కు వ్య‌తిరేకంగా ఆదానీ లాంటి వారు ఏపిలో పెట్టుబ‌డులు పెడ‌తారా అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌. ఇక‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో సైతం ఆదానీ లాంటి వారికి స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి. చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ఆదానీ లాంటి వారు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపికి వ‌స్తున్నార‌నే ప్ర‌చార‌మూ ఉంది. దీంతో..పైకి కనిపించే విధంగా రాజ‌కీయాలు లేవా అనే సంశ‌యం క‌లుగుతోంది . ఇదే స‌మ‌యంలో మోదీ ఏపి పై ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లుగా వ్య‌తిరేక‌త తో లేర‌నే సంకేతాలు ఇవ్వ‌టానికే ఆదానీ లాంటి వారు ఏపిలో పెట్టుబ‌డుల‌కు ముందుకొస్తున్నార‌నే వాద‌న ఉంది.

English summary
Adani group investing about rs 70,000 cr in AP IT sector. Adani and AP govt enter iinto MOU on this project. Adani is nearest to P.M Modi. As Modi associate Adani investing in AP is now became hot topic in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X