• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టిడిపిలోకే ఆలీ : అక్క‌డి నుండే పోటీ : ఆయ‌న‌దే ఫైన‌ల్‌..!

|
    Comedian Ali Decided To Continues In TDP | Oneindia Telugu

    కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతార‌నే చ‌ర్చ సాగుతోంది. తొలి నుండి ఆలీ ప‌వ‌న్ క‌ళ్యాన్ కు సన్నిహితుడు కావ‌టంతో..జ‌న‌సేన లో నే ఉంటార‌ని భావించారు. అయితే, వైసిపి లో చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రిని కలిసారు. తాజాగా, మంత్రి గంటాను క‌లిసారు. ఇక‌, ఇప్పుడు ఆలీ రాజ‌కీయ అడుగుల పై దాదాపు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మే..పార్టీ సైతం దాదాపు ఫైన‌ల్‌..

    జగన్‌ను అలా కలిశానే తప్ప!: పవన్ కళ్యాణ్‌తో అలీ సుదీర్ఘ భేటీ, వీడని సస్పెన్స్ జగన్‌ను అలా కలిశానే తప్ప!: పవన్ కళ్యాణ్‌తో అలీ సుదీర్ఘ భేటీ, వీడని సస్పెన్స్

    టిడిపి లో సీటు ఖాయం..

    టిడిపి లో సీటు ఖాయం..

    సినీ న‌టుడు ఆలీ 20 ఏళ్ల కాలంగా రాజ‌కీయంగా టిడిపి లో ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్నారు. అయితే, సినిమా రంగంలో ప‌వ‌న్‌- ఆలీ అత్యంత స‌న్నిహితులు. ప‌వ‌న్ క‌ళ్యాన్ రాజ‌కీయ పార్టీ ఏర్ప‌టు చేయ‌టంతో ఆయ‌న జ‌న‌సేన లోనే ఉంటార‌ని..ఈ సారి జ‌న‌సేన నుండే పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు.

    జ‌గ‌న్ తో అలీ

    జ‌గ‌న్ తో అలీ

    ఇదే స‌మ‌యంలో వైసిపి అధినేత జ‌గ‌న్ తో అలీ స‌మావేశ‌మైన ఫొటోలు..వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేసాయి. ఇక‌, ఆలీ వైసిపి లో చేర‌టం ఖాయ‌మ‌ని.. అందుకు ముహూర్తం ఖ‌రారైంద‌నే ప్ర‌చారం సాగింది. ఈ స‌మ‌యంలోనే..స‌డ‌న్ గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో స‌మావేశం అయ్యారు. అయితే చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు ఆలీ వెళ్లి క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో..ఆలీ ఇక టిడిపి లోనే ఉంటార‌నే వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆలీ రాజ‌కీయంగా త‌న‌కు స‌న్నిహితుడైన మంత్రి గంటా తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

    సీటు ఖాయం...ఆ హామీ పైనే చ‌ర్చ‌..

    సీటు ఖాయం...ఆ హామీ పైనే చ‌ర్చ‌..

    సినీ న‌ట‌డు ఆలీ టిడిపి అధినేత , ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు టిడిపిలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండి సీటు ఇస్తామ‌ని కూడా ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే హామీ ఇచ్చార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, జ‌నసేన కాద‌ని టిడిపి లో చేరితే ఏ ర‌కంగా స‌మాధానం చెప్పుకోవాల‌నే దాని పైనా ఆలీ ఈ స‌మావేశంలో గంటా తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

    అనేక సంద‌ర్భాల్లో టిడ‌పికి అనుకూలంగా ప‌ని చేసిన ఆలీ ఇప్పుడు టిడిపి నుండే పోటీ చేయాల‌ని దాదాపు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. పార్టీ ప‌రంగా భ‌విష్య‌త్ ఉంటుంద‌ని..ఇది ముఖ్య‌మంత్రి మాట‌ని మంత్రి గంటా ఆలీకి చెప్పుకొచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో.. మ‌రో సారి ప‌వ‌న్ క‌ళ్యాన్ తో ఆలీ భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. త్వ‌రలోనే ఆలీ తాను ఏ పార్టీలో కొన‌సాగేదీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు.

    English summary
    Cine actor Ali decided to continues in TDP. C.M Chandra Babu assured him for Guntur East Ticket. Ali is the good friend of Janasena chief Pawan Kalyan. As of now information Ali may continue from TDP.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X