అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంద‌రి దృష్టి జ‌న‌సేన వైపే..! ఏపి రాజ‌కీయాల్లో ట్రంప్ కార్డ్ కానున్న ప‌వ‌న్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఇదేనా ??

హైద‌రాబాద్ : ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లి జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ప‌టిష్టంగా ఉన్న అదికార టీడిపి, బ‌లంగా ఉన్న ప్ర‌తిప‌క్ష వైసీపి పార్టీలు కూడా ఇప్పుడు జ‌నసేన వేయ‌బోయే అడుగుల‌పై ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి. ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఒంట‌రిగా ఎదుర్కొంటాడా లేక ఎవ‌రితోనైనా పొత్తు ఉంటుందా అనే అంశం ప‌ట్ల ఇరు పార్టీలు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. పొత్తుల ప‌ట్ల ప‌వ‌న్ స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం, 175నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో వేడిని ర‌గిల్చింది. అంతే కాకుండా ప‌వ‌న్ త‌మ‌తో ఉంటే ప్ర‌తిప‌క్ష పార్టీకి ఉలుకెందుక‌ని స్వ‌యంగా ఏపీ సీయం చంద్ర‌బాబు ప్ర‌స్థావించడం, అందుకు ప‌వ‌న్ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది.

జ‌న‌సేన పై అతి చేస్తున్న పార్టీలు..! ప‌వ‌న్ కి లేని దుర‌ద పార్టీల కెందుకు..?

జ‌న‌సేన పై అతి చేస్తున్న పార్టీలు..! ప‌వ‌న్ కి లేని దుర‌ద పార్టీల కెందుకు..?

ఏపిలో రాజ‌కీయ స్వ‌రూపం మారుతోంది. ఎన్నిక‌ల వాతార‌ణాన్ని మ‌రిపించే స్తాయిలో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్నారు నాయ‌కులు. ఇక బీజేపి, కాంగ్రెస్ పార్టీల‌ను కాసేపు ప‌క్క‌న పెడితే రాజ‌కీయం మొత్తం టీడిపి, జ‌న‌సైన, వైసీపి చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నిక‌ల హామీల‌పై ప‌వ‌న్ టీడీపీను నిల‌య‌దీయ‌టం తెలుగు త‌మ్ముళ్లు జీర్ణించుకోలేక‌పోయారు. దీంతో రాత్రికి రాత్రే ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడిపి శ్రేణుల‌కు శ‌త్రువుగా మారిపోయాడు. అయితే.. కాపుల ఓట్లు ప‌వ‌న్ మాట‌పై ఆదార‌ప‌డ‌టంతో టీడీపీ ఆ త‌రువాత ఆచితూచి ప‌వ‌న్ కామెంట్స్‌పై స్పందిస్తూ వ‌స్తుంది.

అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్ అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్

ప‌వ‌న్ చుట్టూ ఏపి రాజ‌కీయం..! క‌ర్ణాట‌క సీన్ ఏపిలో రిపీట్ అవుతుందా..?

ప‌వ‌న్ చుట్టూ ఏపి రాజ‌కీయం..! క‌ర్ణాట‌క సీన్ ఏపిలో రిపీట్ అవుతుందా..?

ఇటీవ‌ల చంద్ర‌బాబు ఓ అడుగు ముందుకేసి ప‌వ‌న్ మా వాడేనంటూ పాచిక వేశారు. అయితే ప‌వ‌న్ మాత్రం, తాము వామ‌ప‌క్షాల‌తో క‌లుస్తాం కానీ, మిగిలిన పార్టీల‌తో క‌లిస్తే ప్ర‌స‌క్తే లేదంటూ తెగేసి చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ లో ఉన్న అనుమానాలు కూడా దీంతో ప‌టాపంచ‌ల‌య్యాయి. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో వైసీపీ, టీడీపీ ఎవ‌రో ఒక‌రు న‌ష్ట‌పోవ‌టం ఖాయం. అయితే.. ఎవ‌రు బ‌య‌ట‌ప‌డి.. తాము న‌ష్ట‌పోతామ‌ని క‌మిట్ అయినా ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తినే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే.. ఎవ‌రికి వారు.. త‌మ లెక్క‌లు స‌రిచేసుకుంటున్నారు.

ఏపీలో మారుతున్న రాజ‌కీయం..! ప‌వ‌న్ పాట పాడుతున్న పార్టీలు..!!

ఏపీలో మారుతున్న రాజ‌కీయం..! ప‌వ‌న్ పాట పాడుతున్న పార్టీలు..!!

స‌ర్వేల‌తో వ‌చ్చిన నివేదిక ఆదారంగా ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేయ‌టం వ‌ల్ల టీడీపీకే న‌ష్టం అంటూ వైసీపీ, కాదు వైసీపీ బారీగా సీట్లు కోల్పోతుందంటూ టీడీపీ గ‌ణాంకాలు బ‌య‌ట‌పెడుతున్నాయి. అందుకే ప‌వ‌న్ ఒంట‌రిగానే పోటీ చేయ‌మంటూ ఇరు పార్టీల నేత‌లు జ‌న‌సేనానికి పోటీప‌డి మ‌రి సూచ‌న‌లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. పైగా సీపీఐ, సీపీఎం వంటి వామ‌పక్షాలు కేవ‌లం ప్ర‌జా ఉద్య‌మంలో దీటుగా ఉండ‌గ‌ల‌వు. ఎన్నిక‌ల పోరులో ఓట‌ర్లను ఆక‌ట్టుకోలేవు. ఇప్పుడున్న పోటీలో మ‌ద్యం మ‌నీని కూడా కుమ్మ‌రించ‌నూ లేవు. కాబ‌ట్టి, వామ‌పక్ష బావ‌జాలం ఉన్న ఓట‌ర్ల ఓట్లు త‌మ‌కు వచ్చినా రాక‌పోయినా పెద్ద న‌ష్ట‌మేమీ కాద‌నేది వైసీపీ, టీడీపీ నేత‌ల దీమాగా చెప్పొచ్చు.

ప‌వ‌న్ ఎవ‌రి విజ‌యాన్ని ప్ర‌భావితం చేస్తారు..! ఏపిలో ఎక్క‌డ చూసినా ఇదే టాపిక్...!!

ప‌వ‌న్ ఎవ‌రి విజ‌యాన్ని ప్ర‌భావితం చేస్తారు..! ఏపిలో ఎక్క‌డ చూసినా ఇదే టాపిక్...!!

అయితే 2014 ఎన్నిక‌ల్లో కాపుల‌ను టీడీపీ వైపు మ‌ళ్లించి, కాపు ఓటర్ల‌ను ప్ర‌భావితం వేయించ‌గ‌లిగాడ‌ని బావిస్తున్న కాపు సామాజిక వ‌ర్గం ప‌వ‌న్ వైపు సానుకూల‌త వ్య‌క్తంచేస్తున్నారు. మైనార్టీలు, ఎస్సీల్లో ఓ వ‌ర్గం కూడా ప‌వ‌న్ ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్నారంటూ జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. ఈ లెక్క‌న‌. అటు టీడీపీలో కొన్ని, ఇటు వైసీపీలో కొన్ని ఓట్లు చీలితే, న‌ష్ట‌పోయేదెవ‌ర‌నేది స‌మాధానం దొర‌క‌ని ప్రశ్న‌గా మారింది. ఇక ఇదే అంశం ప‌ట్ల ప్ర‌ధాన పార్టీలు కూడా ఉత్కంఠ‌త‌కు గురౌతున్న‌ట్టు స‌మాచారం.!

English summary
AP politics has been revolving around Pawan Kalyan. The strongly oppressed TDP and the strong opposition parties are now looking forward to the prospect of Janasena political steps. Both parties are keen to see whether Pawan will face the next election or whether or not he has with alliance anybody else.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X